MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Shooting Secrets: సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇంటిమేట్ సీన్లు చూస్తున్నప్పుడు అవి నిజంగానే చిత్రీకరిస్తారా? ఇలాంటి సీన్స్ ఎలా చేయగలుగుతారు? అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. హాలీవుడ్ నటి సారా షాహి దీనిపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 17 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హాలీవుడ్ నటి సారా షాహి షాకింగ్ కామెంట్స్
Image Credit : SarahShahi/instagram

హాలీవుడ్ నటి సారా షాహి షాకింగ్ కామెంట్స్

సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో హీరోహీరోయిన్ల మధ్య కనిపించే ఇంటిమేట్ సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా సహజంగా అనిపిస్తుంటాయి. తెరపై చూస్తే నటీనటులు నిజంగానే అంత దగ్గరగా ఉంటున్నట్టుగా కనిపిస్తారు. అయితే కెమెరా ముందు ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించడం అంత సులభమైన విషయం కాదు. నటీనటుల వ్యక్తిగత హద్దులు, సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అలాంటి ఒక ఆసక్తికరమైన ట్రిక్ గురించి హాలీవుడ్ నటి సారా షాహి వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంటిమేట్ సీన్ సీక్రెట్
Image Credit : twitter

ఇంటిమేట్ సీన్ సీక్రెట్

బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు నటీనటుల మధ్య గాలి తీసేసిన చిన్న యోగా బాల్‌ను ఉంచుతారట. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. నటీనటుల మధ్య నేరుగా శారీరక స్పర్శ లేకుండా ఈ ట్రిక్ ఫాలో అవుతారట. సీన్ లో ఇద్దరు చాలా దగ్గరగా కనిపించాల్సి ఉంటుంది. అయితే కెమెరాకు కనిపించకుండా వారి మధ్యలో మెత్తగా ఉండే యోగా బాల్‌ను పెడతారు. దీంతో సన్నివేశంలో అసౌకర్యం లేకుండా శరీరాన్ని తాకకుండా ఆ బాల్‌ను మాత్రమే తాకేలా చూసుకుంటారు.

అంటే తెరపై ఇద్దరు నటీనటులు చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా.. వాస్తవంగా మాత్రం షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హీరో స్పర్శకు బదులు ఆ బాల్ తాకిన అనుభూతినే తాను అనుభవిస్తానని సారా షాహి చెప్పారు.

34
ముందే చర్చిస్తారు
Image Credit : SarahShahi/instagram

ముందే చర్చిస్తారు

ఇలాంటి పద్ధతులు నటీనటుల వ్యక్తిగత హద్దులు, సౌకర్యాన్ని గౌరవించడంలో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాల్లో నటీనటులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు షూటింగ్‌కు ముందే సన్నివేశంలోని కదలికలు, కెమెరా యాంగిల్స్, పరిమితులు వంటి అంశాలను స్పష్టంగా చర్చిస్తారు.

44
కో ఆర్డినేటర్స్ ఉంటారంట
Image Credit : SarahShahi/instagram

కో ఆర్డినేటర్స్ ఉంటారంట

ప్రస్తుతం సినిమా, టెలివిజన్ రంగంలో ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణకు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని ప్రొడక్షన్స్ ప్రత్యేకంగా ఇంటిమసీ కోఆర్డినేటర్లను కూడా పెట్టుకుంటున్నారు. నటీనటులు ఏ మేరకు సౌకర్యంగా ఉన్నారు, సన్నివేశంలో ఎలాంటి కదలికలు ఉండాలి, శారీరక స్పర్శకు అనుమతి ఉందా లేదా వంటి అంశాలను ముందుగానే మాట్లాడుకుంటారు.

తెరపై కొన్ని క్షణాల పాటు కనిపించే సన్నివేశం వెనుక ఇంతటి జాగ్రత్తలు ఉంటాయని చాలా మంది ప్రేక్షకులకు సాధారణంగా తెలియదు. కెమెరా యాంగిల్స్, లైటింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫీతో పాటు ఇలాంటి ప్రాక్టికల్ టెక్నిక్స్‌ను ఉపయోగించడం ద్వారా సన్నివేశాలను సహజంగా కనిపించేలా మేకింగ్ చేస్తారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
హాలీవుడ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image2
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image3
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Related Stories
Recommended image1
Vaseline Cleaning Hacks: ఆల్ ఇన్ వన్ సొల్యూషన్..ఎంతటి పాత వస్తువునైనా నిమిషాల్లో మెరిసిపించేస్తుంది
Recommended image2
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved