MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న నటిపై ముచ్చటపడిన నిర్మాత, చుక్కలు చూపించింది.. హీరో సుమన్ కి కూడా షాక్

10th క్లాస్ పరీక్షలు రాస్తున్న నటిపై ముచ్చటపడిన నిర్మాత, చుక్కలు చూపించింది.. హీరో సుమన్ కి కూడా షాక్

హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2024, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరో సుమన్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరో. సుమన్ కొన్ని ఊహించని వివాదాల్లో చిక్కుకోకముందు అనేక అనేక అద్భుత చిత్రాల్లో నటించాడు. సుమన్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార ఒకటి. సితార చిత్రంలో సుమన్, భానుప్రియ జంటగా నటించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డైరెక్టర్ వంశీ ఎంతో కళాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెజెండ్రీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడిద నాగేశ్వర రావు శంకరాభరణం, సీతా కొక చిలుక, సాగర సంగమం, స్వయం కృషి లాంటి క్లాసిక్ చిత్రాలని నిర్మించారు. హీరోయిన్ల విషయంలో ఆయన చాలా సెలెక్టివ్ గా ఉండేవారట. 

36

ఒక కథకి ఎలాంటి అమ్మాయి సరిపోతుందో అంచనా వేసేవారట. సితార చిత్రం ఈ ఏడాదికి విడుదలై 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు. సితార చిత్రం తెరకెక్కించాలనుకున్నప్పుడు హీరోగా సుమన్ ని ఎంచుకున్నారట. 

46

సుమన్ కి అప్పటికి ఇంకా క్రేజీ హీరో అనే గుర్తింపు రాలేదు. దీనితో సుమన్ తాము చెప్పిన రెమ్యునరేషన్ కి అంగీకరించాడు. కానీ హీరోయిన్ విషయంలోనే సమస్య వచ్చినట్లు వంశీ తెలిపారు. హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు హీరోయిన్ రాధ గురించి చెప్పారు. ఆ పిల్ల భలే ఉందయ్యా. మన సినిమాలో రాధని ఎందుకు హీరోయిన్ గా పెట్టకూడదు అని అడిగారట. 

56

రాధ 10 వ తరగతి చదువుతున్నప్పుడే చూశారట. సీతాకోక చిలుక చిత్రంలో ముందుగా హీరోయిన్ రాధని తీసుకోవాలనిఏడిద నాగేశ్వర రావు ముచ్చటపడ్డారట. కానీ అదే సమయంలో రాధ 10 వ తరగతి పరీక్షలు రాస్తోంది. దీనితో ఆ చిత్రంలో ముచ్చెర్ల అరుణని ఎంచుకున్నారు. 

66

ఆ తర్వాత మరోసారి సితార చిత్రం సమయంలో రాధ ప్రస్తావన వచ్చింది. ఈ చిత్రం కోసం రాధని సంప్రదించారు. కానీ రాధ ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేసి సంచలనం సృష్టించింది. దీనితో నిర్మాత, డైరెక్టర్ షాక్ అయ్యారు. అప్పటికి సుమన్ స్టార్ హీరో కాకపోవడంతో రాధ అంత మొత్తం డిమాండ్ చేసింది.   ఆమె అడిగినంత ఇస్తే ఓవర్ బడ్జెట్ అయిపోతుందని భాను ప్రియని హీరోయిన్ గా తీసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో
Recommended image2
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Recommended image3
Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved