MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్‌ `అన్నా` అని పిలవడంతో షో నుంచి వెళ్ళిపోయిన హైపర్‌ ఆది.. ట్రాక్‌ ఎక్కి నిరసన.. అంతా రచ్చరచ్చ..

హీరోయిన్‌ `అన్నా` అని పిలవడంతో షో నుంచి వెళ్ళిపోయిన హైపర్‌ ఆది.. ట్రాక్‌ ఎక్కి నిరసన.. అంతా రచ్చరచ్చ..

హైపర్‌ ఆది.. ఇప్పుడు అన్ని ఈటీవీ షోలకు మెయిన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ని హీరోయిన్‌ అన్నా అని పిలవడంతో బాగా హర్ట్ అయిపోయాడు. ట్రాక్‌ మీద పడుకుని నిరసన తెలియజేయడం హాట్‌ టాపిక్ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 07 2022, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోవడంతో `జబర్దస్త్`, `శ్రీ దేవి డ్రామా కంపెనీ`, `ఢీ` షోలకు హైపర్‌ ఆదినే మెయిన్‌ ఎంటర్‌టైనర్‌ అవుతున్నాడు. ఆయన ఏం చేసినా నవ్వులు పూయడం విశేషం. కొత్త, పాత యాంకర్లతో పులిహోర కలుపుతూ చర్చనీయాంశం అవుతున్నాడు. షోలకు స్పెషల్‌ మైలేజ్‌ తీసుకొస్తున్నాడు. 

26

అమ్మాయిలతో బావ అని పిలిపించుకునేందుకు, లవర్‌గా పిలుపించుకునేందుకు ఆరాటపడే హైపర్‌ ఆదికి పెద్ద షాక్‌ తగిలింది. హీరోయిన్‌ ఆయన్ని అన్నయ్య అని పిలిచింది. షో వేదికపై అందరి ముందు ఆమె అన్నయ్య అని పిలవడంతో గట్టిగా హర్ట్ అయ్యాడు ఆది. దీంతో షో నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ట్రాక్‌ ఎక్కి నిరసన తెలియజేశాడు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే అలానే ఉండిపోతానని హెచ్చరించాడు. మరి ఇంతకి ఏం జరిగిందంటే. 
 

36

`శ్రీదేవి డ్రామా కంపెనీలోకి `ముఖచిత్రం` సినిమా యూనిట్‌ వచ్చింది. ఈ నెల 9న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా హీరోహీరోయిన్‌ వికాస్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, సినిమా రైటర్‌ సందీప్‌ రాజ్‌, దర్శకుడు గంగాధర్‌ ఇందులో పాల్గొన్నారు. సందడి చేశారు. అయితే ఇందులో హీరోయిన్‌ ప్రియా వడ్లమానితో కాసేపు పులిహోర కలిపాడు హైపర్‌ ఆది. 
 

46

మిమ్మల్ని మంచు హుషారుగా ఉన్నప్పుడు చూశానంటూ ఆమెని గుర్తు చేసుకున్నాడు ఆది. హుషారు పాట వేయడంతో ప్రియా సిగ్గులు మొగ్గేసింది. ఆ సినిమాలో సన్నివేశం చెబుతున్న క్రమంలో ప్రియా అన్నా అని పిలిచింది. స్టేజ్ పైనే అందరి ముందు అలా పిలవడంతో షాక్‌ అయ్యాడు ఆది. నరేష్‌ నోరెళ్ల బెట్టాడు. అన్నా అంటూ ఆదిని మరింతగా రెచ్చగొట్టాడు. దీంతో షో నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు ఆది. 
 

56

అందరు వద్దు వద్దు అంటూ అరుస్తున్నా, ఎవరికీ లెక్కచేయకుండా స్టేజ్‌ దిగివెళ్లిపోయాడు ఆది. అంతేకాదు కెమెరాలకు వాడే ట్రాక్‌పై పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఆమాటని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశాడు. దీనికి స్పందించి ప్రియా.. `అన్నయ్య మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను` అని అనడంతో .. `అన్నయ్య అంటుంది, తట్టుకోలేను అంటుంది ఎవర్రా ఇది అంటూ ఆది ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

66

`శ్రీదేవి డ్రామా కంపెనీ`లో జరిగిన ఈ సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఆది, ప్రియా మధ్య వచ్చిన సన్నివేశాల్లు కమెడీని పంచాయి. హైలైట్‌గా నిలిచాయి. దీంతోపాటు ఇందులో అమ్మాయిల ప్యాషన్‌ షో, ర్యాంపు వాకులు అదిరిపోయాయి. షో మరింత కలర్‌ఫుల్‌గా సాగింది. ఆకట్టుకుంటుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Recommended image2
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Recommended image3
Gangster Movies: OTTలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇవే..అసలు సిసలైన మజా గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved