MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Dil Raju: మరోసారి తండ్రి అయిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండవ భార్య

Dil Raju: మరోసారి తండ్రి అయిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండవ భార్య

దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. విజయవంతమైన చిత్రాలు నిర్మించడంలో దిల్ రాజుకు తిరుగులేదు. పక్కా ప్రణాళికతో దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 29 2022, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. విజయవంతమైన చిత్రాలు నిర్మించడంలో దిల్ రాజుకు తిరుగులేదు. పక్కా ప్రణాళికతో దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు. సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువ విజయాలు అందుకుంటూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా దిల్ రాజు ఫ్యామిలీలో కొత్త సంతోషాలు వెళ్లి విరిసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని(వైగా రెడ్డి) బుధవారం తెల్లవారు జామున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో దిల్ రాజు ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది. 

36

కొన్నేళ్ల క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత అకాల మరణం చెందారు. వీరికి హన్షిత రెడ్డి సంతానం. మొదటి భార్య మరణం తర్వాత తన కుమార్తె హన్షిత, ఇతర కుటుంబ సభ్యుల సలహా మేరకు దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండవ వివాహం చేసుకున్నారు. 

46

వివాహం తర్వాత ఆమె గర్భందాల్చింది. ఇప్పుడు ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ వార్త తెలియగానే సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో దిల్ రాజు, తేజస్విని దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

56

బండ్ల గణేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. దిల్ రాజు అన్నా నీకు శుభాకాంక్షలు.. ఆయనకి మగబిడ్డ జన్మించాడు అంటూ ట్వీట్ చేశాడు. ఈ శుభవార్తని దిల్ రాజు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

66

శంకర్, రాంచరణ్ కాంబోలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి, విజయ్ కాంబోలో ఓ క్రేజీ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved