MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి కృష్ణుడిగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..? ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి..?

రాజమౌళి కృష్ణుడిగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..? ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి..?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకుడిగా కాకుండా.. స్క్రీన్ పై నటించాడని మీకు తెలుసా..? ఏదో గెస్ట్ రోల్ కాదు.. చాలా ఇంపార్టెంట్ రోల్ లోనే కనిపించాడు. ఇంతకీ ఏంటా సినిమా తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 03 2024, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాహుబలి సినిమాతో టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు రాజమౌళి.. తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళిన రాజమౌళిని  టాలీవుడ్ లో  ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. తెలుగు సినిమా అంటే చీప్ గా చూసే బాలీవుడ్ కు, కోలీవుడ్ కు మన సినిమా గొప్పతనం ఏంటో చూపించాడు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనే విధంగా  మార్చి చూపించాడు రాజమౌళి.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇప్పుడు తెలుగుహీరోలు పాన్ ఇండియా రేంజ్ లో రాణిస్తున్నారు అంటే.. అది రాజమౌళి గొప్పతనమే. ఎందరో దర్శకులకు.. ముఖ్యంగా మణిరత్నం లాంటివారికి కూడా ఆదర్శంగా నిలిచిన జక్కన్న డైరెక్టర్ కాకముందు నటుడని ఎంత మందకి తెలుసు..? నటుడు అంటే పెద్ద నటుడని కాదు..  రాజమౌళి ఒక సినిమాలో బాల నటుడిగా  వెండితెరపై కనిపించారు. అది కూడా ఇప్పుడు కాదు.. ఎప్పుడో నలబై ఏళ్ల క్రితం .. 

35

జక్కన్నకు 10 ఏళ్లు ఉన్నప్పుడు ఓసినిమాలోనటించినట్టు రాజమౌళి  స్వయంగా వెల్లడించారు.  ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. జరిగిన ఓ వన్ టు వన్ లో  ఈవిషయం వెల్లడించారు  రాజమౌళి.  కాని ఆయన నటించిన సినిమా రిలీజ్ అవ్వలేదట. కొన్ని కారణాల వల్ల ఆసినిమా ఆగిపోయిందట.
 

 

 

45

ఇంతకీ రాజమౌళి  బాల నటుడుగా నటించిన ఆసినిమా ఏదో తెలుసా.. పిల్లనగ్రోవి. ఈసినిమాలో జక్కన్న బాలకృష్ణుడిగా నటించారు.  1983లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అయితే అప్పుడు  రాజమౌళికి 10  ఏళ్ల వయస్సు ఉంటుందట. కాని ఆసినిమా రిలీజ్ కాలేదు. రాజమౌళి తండ్రి గొప్ప రచయిత అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకు రచయితగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉండగా.. కీరవాణి తండ్రి  శివశక్తి దత్త ఈసినిమాను డైరెక్ట్ చేశారట. కాని ఈమూవీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే జక్కన్న ఎన్టీఆర్ తో జరిగిన ఓ చిన్న వాదనలో ఈ విషయాన్ని వెల్లడించారట. 

55

తారక్, రాజమౌళి.. నేను సీనియర్ అంటే నేను సీనియర్ అని చిన్న గొడవేసుకున్నారట. సరదాగా జరిగిన ఈ సంబాషణల్లో నేను నీకంటే ముందు బాలనటుడిగా  ఇండస్ట్రీకి వచ్చాను అని ఎన్టీఆర్ అనగా.. రాజమౌళి నీకంటే ముందే నేను బాలనటుడిగా నటించాను అని అసలు సీక్రేట్ ను విప్పారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయడానిక రెడీ అవుతున్నాడు. ఈమూవీకి సబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image3
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved