MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో

Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో

Bigg Boss 10: బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే బిగ్ బాస్ 10వ సీజన్ తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం నడుస్తోంది. కాగా ఓ కంటెస్టెంట్ రెండో రోజే గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 13 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రెండు రోజులకే బిగ్ బాస్ నుంచి పారిపోయేందుకు...
Image Credit : Jio hotstar

రెండు రోజులకే బిగ్ బాస్ నుంచి పారిపోయేందుకు...

దేశవ్యాప్తంగా ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ప్రస్తుతం తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ కొత్త సీజన్ మొదలైంది. తెలుగులో నాగార్జున, తమిళంలోవిజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగులాగే తమిళ్ పదో సీజన్ సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం పందొమ్మిది మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. అయితే ఈ సీజన్ మొదలైన రెండు రోజులు తిరక్కుండానే హౌస్‌లో ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సాధారణంగా షోలో ఎలిమినేషన్స్ ద్వారా లేదా టాస్క్‌ల సమయంలో గొడవల వల్ల రచ్చ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక కంటెస్టెంట్ ఏకంగా ఇంటిని విడిచి పారిపోవడానికి గోడ ఎక్కి అవతల వైపు దూకేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గోడ ఎక్కిన కంటెస్టెంట్
Image Credit : Jio Hotstar

గోడ ఎక్కిన కంటెస్టెంట్

హౌస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ కంటెస్టెంట్ పేరు మహమ్మద్ అన్సార్. ‘కుక్ విత్ కోమాలి’ వంటి కార్యక్రమాల ద్వారా అన్సార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ టైమింగ్, మిమిక్రీతో ప్రేక్షకులను అలరించారు. ఆయన ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే షో ప్రారంభమైన రెండో రోజే ఆయన బిగ్‌బాస్ నిర్దేశించిన నిబంధనలు నచ్చకో, లేక అక్కడి వాతావరణం, తోటి పోటీదారుల ప్రవర్తన వల్ల కలిగిన మానసిక ఒత్తిడి తట్టుకోలేకో గానీ హౌస్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన ద్వారం మూసి ఉండటంతో, తప్పించుకునే మార్గం కనిపించక ఏకంగా హౌస్ ప్రాంగణంలోని ఎత్తయిన గోడను ఎక్కి బయటకు దూకేందుకు ప్రయత్నించారు. తోటి కంటెస్టెంట్లు ఆయనను వారించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు.

33
సోషల్ మీడియాలో వైరల్
Image Credit : Jio Hotstar

సోషల్ మీడియాలో వైరల్

అన్సార్ గోడ ఎక్కి తప్పించుకోవాలని చూసిన వీడియోలు బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నెటిజన్లు, బిగ్‌బాస్ అభిమానులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కూడా పలు సీజన్లలో కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లరి చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, షో ప్రారంభమైన 48 గంటల్లోనే గోడ దూకే స్థాయికి పరిస్థితి వెళ్లడం ఇదే మొదటిసారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే ఒత్తిడి భరించలేక చేసిన పనా లేక ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంటా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image2
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Recommended image3
Epic Day 2 Collections: ఎపిక్‌ మూవీ 2 రోజుల కలెక్షన్లు.. ఆనంద్‌, వైష్ణవి జోడీ బాక్సాఫీసు వద్ద ఇలా చేసిందేంటి?
Related Stories
Recommended image1
Gold Anklets: బంగారు పట్టీలు చూశారా ఎంతలా మెరిసిపోతున్నాయో
Recommended image2
Dogs: పెంపుడు కుక్కలు నిజంగానే మనిషిలో ఉన్న క్యాన్సర్ వ్యాధిని గుర్తుపడతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved