- Home
- Entertainment
- Epic Day 2 Collections: ఎపిక్ మూవీ 2 రోజుల కలెక్షన్లు.. ఆనంద్, వైష్ణవి జోడీ బాక్సాఫీసు వద్ద ఇలా చేసిందేంటి?
Epic Day 2 Collections: ఎపిక్ మూవీ 2 రోజుల కలెక్షన్లు.. ఆనంద్, వైష్ణవి జోడీ బాక్సాఫీసు వద్ద ఇలా చేసిందేంటి?
`బేబీ` తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా `ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్` మూవీలో నటించారు. ఇది ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఎపిక్ మూవీకి మిశ్రమ స్పందన
`బేబీ` తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం `ఎపిక్`(ఫస్ట్ సెమిస్టర్). ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర మూవీస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. బేబీ జోడి నటించిన మూవీ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. దీంతో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో కొంత తడబాటు కనిపించింది. సినిమా ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ డల్‌గా ఉంది, క్లైమాక్స్ బాగుందనే టాక్ వచ్చింది. ఓవరాల్ గా ఎబౌ యావరేజ్ టాక్ వచ్చింది.
ఎపిక్ విషయంలో మైనస్ ఇదే
ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇది దూరం కావాల్సి వచ్చింది. యూత్ మాత్రమే సినిమాని చూస్తున్నారు. దీనికితోడు ఏ క్లాస్ మూవీగా పేరు తెచ్చుకోవడంతో బీ, సీ సెంటర్లలో ఎఫెక్ట్ అయ్యింది. ఇది కలెక్షన్లపై ప్రభావం చూపించింది. ఇక ఈ మూవీ రెండు రోజులు పూర్తి చేసుకుంది. శనివారం ఎంత కలెక్షన్లు వచ్చాయి. టోటల్గా ఇది ఎంత చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత చేయాలనేది చూస్తే.
ఎపిక్ మూవీ 2 రోజుల కలెక్షన్లు
రెండో రోజు ఈ మూవీకి రూ.1.30కోట్ల ఇండియా నెట్ రాబట్టింది. రెండు కోట్లకుపైగానే గ్రాస్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక టోటల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఇది రెండు రోజుల్లో రూ.5.60కోట్లు వసూలు చేయడం విశేషం. చిత్ర బృందం మాత్రం దీనికి మొదటి రోజే ఐదు కోట్లు వచ్చిందని వెల్లడించడం గమనార్హం. ఓవర్సీస్‌లో ఇది రూ.1.65కోట్లు రాబట్టింది. బేబీ జోడికిది చాలా తక్కువ కలెక్షన్లు అనే చెప్పొచ్చు. మొదటి రోజుతో పోల్చితే వసూళ్లు తగ్గాయి. మరి ఆదివారం అయినా పుంజుకుంటుందేమో చూడాలి. లేదంటే ఇది థియేట్రికల్‌గా డిజప్పాయింట్ చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇక సినిమాకి అయిన బడ్జెట్ రూ.15కోట్లు(ప్రమోషన్స్ తో సహా). అయితే నిర్మాతలు సొంతంగానే రిలీజ్ చేశారు. ఆరున్నరకోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే రూ.13కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పుడు అందులో 40శాతం మాత్రమే రాబట్టింది. మరి ఈ వారంలో సినిమా ఆడేదాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఎపిక్ మూవీ కథ
వనపర్తికి చెందిన ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు ఆనంద్ దేవరకొండ సినిమా డైరెక్టర్ కావాలనే కలలు కంటుంటాడు. వాళ్ల నాన్న శివాజీ టీచర్. డిగ్రీ చేసి మూడేళ్లు అయినా ఖాళీగా తిరుగుతున్న ఆదిత్యని యూకే పంపిస్తాడు వాళ్ల నాన్న. ఇష్టం లేకపోయినా పేరెంట్స్ కోసం యూకే వెళ్తాడు ఆదిత్య. తనకు అక్కడ ఏం తెలియదు. అక్కడ మన తెలుగువాడు గవిరెడ్డి పరిచయం అవుతాడు. తన రూమ్ కూడా ఇస్తాడు. కాలేజీకి వెళ్లగా అక్కడ వైష్ణవి చైతన్య పరిచయం అవుతుంది. ఆదిత్యని అన్ని రకాలుగా గైడ్ చేస్తుంది. ఒక రోజు మొత్తం ఆమె తనతోనే ఉంటుంది. దీంతో ఆమెకి ఇంప్రెస్ అవుతాడు ఆదిత్య. అంతేకాదు రాత్రి తన రూమ్‌కి ఇన్‌వైట్ చేయగా, ఆమె కూడా వస్తుంది. ఆ రాత్రి ఇద్దరు మాంచి రొమాంటిక్ మూడ్‌లో కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత పర్మినెంట్‌గా తన రూమ్‌లోనే ఉండిపోతుంది కడలి. ఇద్దరు ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఫిజికల్‌గానూ కలుస్తారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది సినిమా. ప్రేమ, బాధ్యత మధ్య నలిగిపోయే అబ్బాయి జర్నీని ఆవిష్కరించిన మూవీ ఇది. యువతకి మంచి సందేశాన్ని అందించిందని చెప్పొచ్చు.

