MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌

Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌

Chaitra Rai Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి మొదటి వారంలోనే చరణ్‌, చైత్ర రాయ్‌ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరి ఆమెకి ఎంత పారితోషికం దక్కుతుందనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 12 2026, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రేటింగ్‌ కోసం బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ ల మీద ట్విస్టులు
Image Credit : youtube/@starmaa

రేటింగ్‌ కోసం బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ ల మీద ట్విస్టులు

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభమై మొదటి వారం పూర్తి కావస్తుంది. సెప్టెంబర్‌ 6న స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా 16 మంది కంటెస్టెంట్లతో షోని స్టార్ట్ చేశారు. ఈ సారి సెలబ్రిటీ విభాగంలో క్రేజీ కంటెస్టెంట్లు వచ్చారు. మంచి పేరున్న వారినే తీసుకొచ్చారు. దీంతో షోపై ఆసక్తి ఏర్పడింది. కానీ అనుకున్న స్థాయిలో దీనికి రేటింగ్‌ రావడం లేదు. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ అంటూ హడావుడి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిడ్‌ వీక్‌లో ఇద్దరు ఎలిమినేట్‌
Image Credit : instagram/@biggbosstelugu

మిడ్‌ వీక్‌లో ఇద్దరు ఎలిమినేట్‌

మొదటి వారంలోనే మిడ్‌ వీక్‌లో ఇద్దరు కంటెస్టెంట్లని ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే. నాల్గో రోజు చరణ్‌ని హౌజ్‌ నుంచి పంపించారు. ఐదో రోజు చైత్రని ఎలిమినేట్‌ చేశారు. ఒకే వారంలో, అది కూడా ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లకి షాకిస్తుంది. బిగ్‌ బాస్‌ ఇచ్చే ట్విస్ట్ లు కంటెస్టెంట్లకి మైండ్‌ బ్లాక్‌ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఎలిమినేట్‌ అయిన వారిని సీక్రెట్‌ హౌజ్‌లో పెట్టారని, మళ్లీ సండే రోజు వారిని హౌజ్‌లోకి తీసుకొస్తారనే ఊహల్లో కంటెస్టెంట్లు, ఆడియెన్స్ ఉన్నారు. కానీ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో డైరెక్ట్ గా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లతో మాట్లాడారు. వాళ్లు వాళ్ల ఇంట్లకి వెళ్లిపోయారు.

34
చైత్ర రాయ్‌ పారితోషికం
Image Credit : instagram/@biggbosstelugu

చైత్ర రాయ్‌ పారితోషికం

దీంతో మిడ్‌ వీక్ ఎలిమినేట్ అయిన చరణ్‌, చైత్ర రాయ్‌ మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే బిగ్‌ బాస్‌ నిర్వాహకుల నుంచి మాత్రం ఒకరిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందంటున్నారు. మరి అది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఇక రెండో ఎలిమినేట్‌ అయిన చైత్ర రాయ్‌ కి ఎంత పారితోషికం ఇచ్చారు. ఆమె ఐదు రోజులకు ఎంత తీసుకుందనేది చూస్తే, ఆమెకి వారానికి రూ.2.5లక్షల పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారట. అంటే రోజుకి రూ.35వేలు. ఇప్పుడు ఆమె ఐదు రోజులు హౌజ్‌లో ఉంది. అంటే సుమారు రూ.1.75లక్షలు పొందుతారని చెప్పొచ్చు. అయితే హౌజ్‌లో ఉన్న రోజులకే పారితోషికం ఇస్తారా? వారానికి కన్సిడర్‌ చేసి ఇస్తారా అనేది సస్పెన్స్. చాలా వరకు వారానికి పరిగణించి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన చైత్ర రాయ్‌కి రూ.2.5లక్షలు అందుతాయని చెప్పొచ్చు.

44
బిగ్‌ బాస్‌ షోపై విమర్శలు
Image Credit : instagram/@biggbosstelugu

బిగ్‌ బాస్‌ షోపై విమర్శలు

తన పది నెలల చిన్నారిని వదిలేసి తానేంటో మళ్లీ నిరూపించుకునేందుకు బిగ్‌ బాస్‌ షోకి వచ్చినట్టు చెప్పింది చైత్ర రాయ్‌. కానీ ఆమె మొదటి వారంలోనే ఐదు రోజులకే హౌజ్‌ని వీడాల్సి రావడం విచారకరం. అయితే ఇది బిగ్‌ బాస్‌ షోపై బజ్‌ కోసం నిర్వాహకులు చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. కానీ అది పాజిటివ్‌ కంటే నెగటివ్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం సరికాదంటున్నారు. వాళ్లేంటో నిరూపించుకునే టైమ్‌ ఇవ్వాలని కామెంట్‌ చేస్తున్నారు బిగ్‌ బాస్‌ లవర్స్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved