- Home
- Entertainment
- Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
వెంకటేష్ ఆదర్శకుటుంబం నుంచి చిరంజీవి కాకా వరకు సీనియర్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్దకు క్యూ కడుతున్నాయి. ఏ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Tollywood Senior Heroes
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున బాలకృష్ణ లకు ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా వీరి సినిమాల పోటీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఆ పోటీ ఇంకా బలంగా మారుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ ఏడాది దసరా నుంచి 2027 సంక్రాంతి వరకు ఈ నలుగురు హీరోలు బాక్సాఫీస్ దండయాత్రకు క్యూ కట్టారు. ఆ సినిమాలు ఏంటి ? అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి ? వాటి పొటెన్షియల్ ఎంత అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వెంకటేష్- ఆదర్శ కుటుంబం AK 47
త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తొలిసారి వెంకీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ మూవీ దసరా సీజన్ లో అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో బలమైన ఇమేజ్ ఉంది. వాళ్ళని సంతృప్తి పరిచేలా మూవీ ఉంటే చాలు 300 కోట్ల గ్రాస్ కొట్టడం కష్టం ఏమీ కాదు. ఆల్రెడీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఆ ఫీట్ సాధించారు.
నాగార్జున -కింగ్ 100
అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీకి రెడీ అవుతున్నారు. నాగార్జున 100వ చిత్రం కింగ్ 100 క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జునకి 300 కోట్ల సినిమా పక్కన పెడితే కనీసం 100 కోట్ల గ్రాస్ మూవీ కూడా లేదు. కింగ్ 100 తో ఆ రికార్డ్ అందుకునే అవకాశం నాగార్జునకి ఉంది. అంచనాలు ఉన్నాయి కాబట్టి మూవీ బావుంటే చాలు కలెక్షన్స్ వస్తాయి.
బాలకృష్ణ - దాదా
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 2వ సినిమా దాదా. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది. బాలయ్య ఇంత వరకు 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కాలేదు. దాదా మూవీతో బాలయ్యకి ఆ అవకాశం ఉందనే చెప్పాలి. కానీ దాదా, కింగ్ 100 రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
చిరంజీవి - కాకా
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం కాకా. వాల్తేరు వీరయ్య మూవీ 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. చిరంజీవి చివరి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు మూవీ 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కాకా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మరోసారి మెగాస్టార్ 300 కోట్లు కొట్టడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి.

