- Home
- Entertainment
- పూజా హెగ్డే ధరించిన చెప్పుల ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రెడ్ కార్పెట్ పై నడిచేందుకు అన్ని లక్షల?
పూజా హెగ్డే ధరించిన చెప్పుల ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రెడ్ కార్పెట్ పై నడిచేందుకు అన్ని లక్షల?
టాలీవుడ్ బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ పరిచయమే. ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

తొలిసారిగా 2010లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక నిజానికి దర్శకనిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలా వైకుంఠపురంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీలో అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ అందుకొని నిరాశ చెందింది.
ఇదంతా పక్కన పెడితే తనకు 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే. మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు అవకాశం రాగా అందులో పూజ హెగ్డే కు కూడా రావడం గమనార్హం. పైగా పూజా హెగ్డే కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది.
కానీ అంతలోనే ఈ అమ్మడికి ఒక బాధ తోడయింది. అదేంటంటే తనతో తీసుకెళ్లిన మేకప్ కిట్, తదితర వస్తువులు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికలో కూడా తెలిపింది. విమాన ప్రయాణంలో రెండు బ్యాగులు అనుమతించకపోవడంతో ఒక బ్యాగు తో వెళ్లినందుకు ఆ బ్యాగు కూడా పోయిందని తెలిపింది. ఇక రెడ్ కార్పెట్ పైకి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతున్న సమయంలో అప్పటికప్పుడే ఫ్రాన్స్ లో కొత్త డ్రెస్ కొనుకున్నానని తెలిపింది.
ఇక తన టీమ్ తన మేకప్ ప్రొడక్ట్స్ రెడీ చేశారు అని ఆ తర్వాత రెడ్ కార్పెట్పై ఎలాగోలా వెళ్లాను అని తెలిపింది. ఇక ప్రస్తుతం తాను కొనుక్కున్న ఎల్లో ఔట్ ఫిట్ డ్రెస్ ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతే కాకుండా తను వేసుకున్న ఆ చెప్పుల కాస్ట్ లక్ష 43 వేలట. ఇక ఆమె చెప్పుల కాస్ట్ అన్ని లక్షలు ఉండటంతో.. రెడ్ కార్పెట్ పై నడిచేందుకు పూజా హెగ్డే అన్ని లక్షలు పెట్టిందా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.