MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?

Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?

Ajay Ghosh: రంగస్థలం సినిమాతో పాపులర్ అయ్యి... వరుసగా ఆఫర్లు సాధిస్తున్నాడు నటుడు అజయ్ ఘోష్. జీవితంలో చాలా కష్టాలు అనుభవించిన అజయ్ ఘోష్.. కెరీర్ లో సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 21 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆలస్యంగా గుర్తింపుపొందిన నటుడు..
Image Credit : Pinterest

ఆలస్యంగా గుర్తింపుపొందిన నటుడు..

తెలుగు - తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలలో వైవిధ్యమైన పాత్రలతో, విలన్ పాత్రల నుండి నవ్వులు పూయించే కామిడీ పాత్రల వరకు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు అజయ్ ఘోష్. వెండితెరపై ఆయన చూపించే గంభీరమైన నటన, క్రూరమైన విలనిజం, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అజయ్ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. చాలా లేట్ గా గుర్తింపు సాధించాడు. ఎన్నో సినిమా కష్టాల తర్వాత అజయ్ ఘోష్ కి కెరీర్ లో బ్రేక్ దొరికింది. ఇక వరుస సక్సెస్ లు, వరుస అవకాశాలతో బిజీగా ఉన్న అజయ్ ఘోష్.. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆస్తుల గురించి, ఆర్థిక స్థితి గురించి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాటకరంగం నుండి వెండితెర వరకు
Image Credit : Pinterest

నాటకరంగం నుండి వెండితెర వరకు

అజయ్ ఘోష్ నట జీవితం సొంత ఊరిలో స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో జన్మించిన అజయ్ ఘోష్, చిన్నతనం నుంచే కళారంగం వైపు ఆకర్షితులయ్యారు. మొదట్లో నాటకాల్లో నటిస్తూ, అనంతరం దూరదర్శన్‌లో ప్రసారమైన 'సిరి' సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ, ఆయన నటజీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'విచారణ' (Visaranai). ఇందులో ఆయన పోషించిన క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.

35
తెలుగులో వరుస అవకాశాలు.. స్టార్ డమ్
Image Credit : our own

తెలుగులో వరుస అవకాశాలు.. స్టార్ డమ్

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి చిత్రంలో నారాయణ పట్వారీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'రంగస్థలం' లో శేషు నాయుడు పాత్ర ఆయన సినీ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అలాగే 'పుష్ప: ది రైజ్' చిత్రంలో కొండరెడ్డిగా, 'రాజు గారి గది 3', 'మత్తు వదలరా', 'బ్రోచేవారెవరురా', 'గుంటూరు కారం' వంటి ఎన్నో చిత్రాల్లో విలన్ గా, హాస్య నటుడిగా ప్రతిభ చాటారు.

45
ఆస్తుల పై అజయ్ ఘోష్ కామెంట్స్..
Image Credit : Pinterest

ఆస్తుల పై అజయ్ ఘోష్ కామెంట్స్..

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ క్లిప్‌లో తన ఆస్తులు, జీవితంలో సాధించిన కొన్ని విషయాల గురించి అజయ్ ఘోష్ చాలా స్పష్టంగా స్పందించారు. "సినిమాల్లో అవకాశాలు వచ్చాక సొంత ఊరిలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. అది కూడా సుకుమార్ 'రంగస్థలం' సినిమా ఇచ్చిన గుర్తింపు, పుణ్యమే. సొంత ఊరితో పాటు హైదరాబాద్ లో కూడా ఒక చిన్న ప్లాట్ తీసుకున్నాను. అది కూడా నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, అలాగే నా పెద్ద కుమారుడు సంపాదించిన డబ్బులు కలిపి హైదరాబాద్‌లో ఒక చిన్న ఫ్లాట్ కొనుగోలు చేశాను''. అని ఆయన వెల్లడించారు

55
అజయ్ ఘోష్ కుటుంబ వివరాలు
Image Credit : Pinterest

అజయ్ ఘోష్ కుటుంబ వివరాలు

అజయ్ ఘోష్ కుటుంబ కుటుంబం గురించి మాట్లాడుతూ... తన పిల్లలు బాగా చదువుకున్నారని పెద్ద కుమారుడు ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు. తన ఇంటికి మంచి కోడళ్లు వచ్చారని.. ఎవరు తమను ఇబ్బంది పెట్టడంలేదంటూ.. కుటుంబం పట్ల తృప్తి వ్యక్తం చేశారు. వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించే సినిమాల్లో నటిస్తుండటంతో, చాలామంది తమ వద్ద కోట్లాది రూపాయల ఆస్తులు, ఎకరాల కొద్దీ పొలాలు ఉంటాయని అనుకుంటారని.. కానీ అది నిజం కాదని ఆయన సరదాగా చెప్పారు. ఆర్టిస్టులుగా తాము సంపాదిస్తూ, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నామని స్పష్టం చేశారు. అడంబరాలకు పోకుండా, తాను సంపాదించిన దానితో సంతృప్తిగా జీవిస్తున్నట్టు అజయ్ ఘోష్ వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli-Mayookha: రాజమౌళి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి, మయూఖ మూవీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Recommended image3
Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved