MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • యాంకర్ రవి భార్యకి దారుణ అవమానం, ఏ మహిళా భరించలేని సంఘటన వెలుగులోకి..అందుకే జీవితాలు నాశనం

యాంకర్ రవి భార్యకి దారుణ అవమానం, ఏ మహిళా భరించలేని సంఘటన వెలుగులోకి..అందుకే జీవితాలు నాశనం

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో షోలని రవి తన ట్యాలెంట్ తో చాలా హుషారుగా నడిపించాడు. లాస్య, శ్రీముఖి లాంటి వాళ్లకి కో యాంకర్ గా చేశాడు. యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో షోలని రవి తన ట్యాలెంట్ తో చాలా హుషారుగా నడిపించాడు. లాస్య, శ్రీముఖి లాంటి వాళ్లకి కో యాంకర్ గా చేశాడు. యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అతడు టివి షో చేసినా, బిగ్ బాస్ లో పాల్గొన్నా ఎక్కువగా వివాదాలతోనే హైలైట్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

యాంకర్ రవి రీసెంట్ గా రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ అనే షోకి అతిథిగా హాజరయ్యాడు. రీతూ చౌదరి గెస్ట్ లని వివాదాస్పద ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యాంకర్ రవి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివాదాలన్నీ రీతూ చౌదరి బయటకి తీసింది. 

38

గతంలో రవి, యాంకర్ లాస్య మధ్య ఎలాంటి రూమర్స్ వచ్చాయో తెలిసిందే. వాటి గురించి కూడా రీతూ ప్రస్తావించింది. రవి కూడా ఏమాత్రం తగ్గకుండా అన్ని వివాదాలకు అంతే బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు. యాంకర్ రవి పక్కా కమర్షియల్ అంటగా అని ప్రశ్నించింది. దీనికి రవి బోల్డ్ గా రిప్లై ఇచ్చాడు. 100 శాతం నేను కమర్షియల్. ఎవరేమనుకున్నా ఇది నిజం. 

48

ఎందుకంటే విరాట్ కోహ్లీని గల్లీలో ఫ్రీగా క్రికెట్ ఆడమంటే ఆడతాడా ? తన స్కిల్ కి తగ్గట్లుగా డబ్బు తీసుకుంటున్నాడు కదా. నేను కూడా అంతే. నాకు వచ్చిన పనిని డబ్బులు తీసుకుని మాత్రామే చేస్తా అని తెలిపాడు. రవి ఎందుకని నీకు పెళ్ళైన సంగతిని ఎక్కువ రోజులు రివీల్ చేయలేదు అని ప్రశ్నించింది. దీనికి రవి పూర్తిగా ఎలాంటి సమాధానం ఇచ్చాడో కంప్లీట్ ఎపిసోడ్ లో చూడాలి. 

58

అయితే ప్రోమోలో రవి ఒక సంచలన సంఘటన బయట పెట్టాడు. అది అలాంటి ఇలాంటి సంఘటన కాదు. ఏ మహిళా కూడా భరించలేని అవమానం తన భార్యకి ఎదురైంది. యాంకర్ లాస్యతో రూమర్స్ వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ఉంది. తన భార్యతో కలసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాడట. 

68
anchor ravi

anchor ravi

అక్కడ కొందరు.. తన భార్యతో.. రవి భార్య ఆ యాంకర్ కదా(రవితో వర్క్ చేసిన కో యాంకర్ ని ఉద్దేశిస్తూ).. నువ్వేంటి నా మొగుడు అని చెప్పుకుని తిరుగుతున్నావు అని అడిగారట. దీనితో నా భార్య భరించలేక పోయింది. ఏ మహిళ అయినా తన భర్తని ఇంకొకరి భర్త అంటే సహించలేదు. రూమర్స్ వల్ల అలాంటి అవమానాలు ఎదురయ్యాయని రవి తెలిపాడు. 

78

బిగ్ బాస్ లో లహరితో జరిగిన గొడవ గురించి రీతూ ప్రశ్నించింది. దీనితో రవి బదులిస్తూ బిగ్ బాస్ లో జరిగిన విషయాలని బయట జీవితాలతో పోల్చవద్దు. జీవితాలు నాశనం అవుతున్నాయి. అక్కడ జరిగిన గొడవల వల్ల కొన్ని రోజులు నా కూతురు ముఖాన్ని కూడా నేను మరిచిపోయా. అంతలా బిగ్ బాస్ నా మైండ్ చెడగొట్టింది అని రవి తెలిపాడు. 

88

ఇంకా రవి మాట్లాడుతూ.. నాపై కొంతమంది యాంకర్స్ తో రూమర్స్ సృష్టించారు.ఆ షో బావుండాలని నేను చేసిన ప్రయత్నం వల్లే. ఆయా రూమర్స్ ఎక్కువయ్యాక.. ఇక షోల విషయంలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. డైరెక్టర్, రచయితకి వదిలేయాలి అని డిసైడ్ అయ్యా అని తెలిపాడు. అసలు అమ్మాయిలతో ముడిపెడుతూ రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు ? ఛానల్ లో న్యూస్ వస్తుంటే.. లేడి న్యూస్ రీడర్ ఉంటేనే నేను చూస్తా. లేకుంటే లేదు. నా మైండ్ సెట్ అంతే. నాదే కాదు అందరి మైండ్ సెట్ ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే గ్లామర్ కి అట్రాక్ట్ అవుతాం అని రవి కామెంట్స్ చేశాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved