MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో

The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో

నేచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2026, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
The Paradise
Image Credit : Asianet News

The Paradise

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. నాని అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ది ప్యారడైజ్‌కి 'ఏ' సర్టిఫికెట్
Image Credit : X

ది ప్యారడైజ్‌కి 'ఏ' సర్టిఫికెట్

నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి 'ఏ' సర్టిఫికెట్ లభించింది. ఇదే సమయంలో సినిమా రన్‌టైమ్ కూడా ఖరారయింది. ది ప్యారడైజ్ మొత్తం నిడివి 2 గంటల 54 నిమిషాలుగా లాక్ అయింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం, దాదాపు మూడు గంటలకు చేరువగా ఉండే రన్‌టైమ్ ఖరారు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

35
21 మార్పులు సూచించిన సెన్సార్ బోర్డు
Image Credit : others

21 మార్పులు సూచించిన సెన్సార్ బోర్డు

ఈ సెన్సార్ బోర్డు ది ప్యారడైస్ చిత్రంలో మొత్తం 21 మార్పులు సూచించారు. కొన్ని అభ్యంతరకర డైలాగులు మ్యూట్ చేశారు. అభ్యతరకర సన్నివేశాలు కట్ చేశారు. అసభ్యకరమైన మాటలని కూడా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 21 చోట్ల మార్పులు చేశారట.

While the emotion of the film is for everyone…
JADAL’s rawness is strictly for the adults 🔥#TheParadise is certified 𝗔 ❤‍🔥

GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26

Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️‍🔥
An @anirudhofficial musical 🎼… pic.twitter.com/gm4lBvVeR6

— SLV Cinemas (@SLVCinemasOffl) September 21, 2026

45
జైలు ఫైట్ కీలక ఆకర్షణ
Image Credit : YouTube

జైలు ఫైట్ కీలక ఆకర్షణ

ఇక ప్యారడైజ్ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి మంచి రియాక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలోని ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే సన్నివేశాలతో పాటు జైలు ఫైట్ కీలక హైలైట్స్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నాయి. ఈ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన స్టైల్ లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ జోడించినట్లు చెబుతున్నారు. సవారీ జాతిపై అణచివేతకు వ్యతిరేకంగా జడల్ అనే యువకుడు చేసిన పోరాటమే ఈ కథ అని అంటున్నారు. ఇందులో మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.

55
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా
Image Credit : Asianet News

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా

ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved