MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • జబర్దస్త్ లో రెమ్యునరేషన్ తక్కువే..కానీ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారంటే, సంచలన నిజాలు చెప్పిన అదిరే అభి

జబర్దస్త్ లో రెమ్యునరేషన్ తక్కువే..కానీ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారంటే, సంచలన నిజాలు చెప్పిన అదిరే అభి

జబర్దస్త్ షోతో పాపులారిటీ సొంతం చేసుకుని సినిమాల్లో రాణిస్తున్న కమెడియన్లు చాలా మందే ఉన్నారు. కమెడియన్లుగా, నటులుగా ఎదగాలనుకునే వారికి జబర్దస్త్ మంచి అడ్డాగా మారింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 13 2024, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్ షోతో పాపులారిటీ సొంతం చేసుకుని సినిమాల్లో రాణిస్తున్న కమెడియన్లు చాలా మందే ఉన్నారు. కమెడియన్లుగా, నటులుగా ఎదగాలనుకునే వారికి జబర్దస్త్ మంచి అడ్డాగా మారింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బుల్లెట్ భాస్కర్, రోహిణి, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి వాళ్లంతా జబర్దస్త్ తో పాపులర్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అదిరే అభి అయితే సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి మరీ జబర్దస్త్ లోకి వచ్చాడు. హైపర్ ఆది లాంటి వాళ్లకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చింది అదిరే అభినే. హైపర్ ఆది కూడా తరచుగా తన ఎదుగుదలకి కారణం అదిరే అభి అన్న అని చెబుతుంటాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయినట్లు వాళ్ళ సన్నిహితులు చెబుతుంటారు. అదంతా జబర్దస్త్ పుణ్యమే. 

37

కానీ ఈ విషయంలో అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ కమెడియన్లు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అని చాలా మంది అంటున్నారు. జబర్దస్త్ తో అది ఎలా సాధ్యం. జబర్దస్త్ వల్ల వాళ్ళకి అంత రెమ్యునరేషన్ వస్తుందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. దీనితో అదిరే అభి సమాధానం ఇచ్చారు. 

47

నా వరకైతే నేను జబర్దస్త్ లోకి రాకముందే సొంత ఇల్లు, కారు కొనుకున్నా. నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ సంపాదించా. జబర్దస్త్ లో వచ్చే రెమ్యునరేషన్ తక్కువే. జబర్దస్త్ వల్ల కోట్లకి కోట్లు సంపాదించారు అనేది కరెక్ట్ కాదు. జబర్దస్త్ వల్ల ఫేమ్ వచ్చింది. అది నిజం. ఆ ఫేమ్ ని ఉపయోగించుకుని చాలా మంది కమెడియన్లు బయట ప్రైవేట్ షోలు చేశారు. రాత్రిళ్ళు మేలుకుని షోలు చేసి.. నిద్రలేకుండా మళ్ళీ జబర్దస్త్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. 

57

ప్రైవేట్ షోలకు ఇచ్చే పేమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లు అంతా ఆస్తులు సంపాదించుకుంది ప్రైవేట్ షోలు, ఈవెంట్స్ వల్లే అని అదిరే అభి అన్నారు. జబర్దస్త్ పాపులారిటీతో మాకు బయట వందలాది ఈవెంట్స్ చేసే అవకాశం వచ్చింది. ఆ ఈవెంట్స్ లో మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. ఆ విధంగా ప్రతి కమెడియన్ సంపాదించుకున్నారు అని అదిరే అభి తెలిపారు. 

67

జబర్దస్త్ చేస్తున్నప్పటికీ మెడికల్ ఖర్చులకు ఇబ్బంది పడే కమెడియన్లు ఇంకా ఉన్నారు అని అదిరే అభి తెలిపారు. జబర్దస్త్ వల్లే కోట్లకు కోట్లు వస్తే అలాంటి వారికి కష్టాలు ఉండకూడదు కదా అని తెలిపాడు. 

77

నా జబర్దస్త్ సహచరులందరికి నాకు తోచింది చెప్పాను. మీకు వచ్చే డబ్బుని వృధా చేసుకోవచ్చు. కార్లు, లగ్జరీలు తర్వాత చూసుకోండి. ముందుగా మీకు ఆదాయం వచ్చే దానిలో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. నేను అలా చేశాను కాబట్టే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నానని అదిరే అభి తెలిపాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved