MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత బౌలర్ మహ్మద్ షమీపై తీవ్రమైన ఆన్‌లైన్ ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. మహ్మద్ షమీ వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు సమర్పించడంతో అతన్ని దూషిస్తూ, బూతులు తిడుతూ పోస్టులు చేశారు కొందరు అభిమానులు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 30 2021, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మహ్మద్ షమీ వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై కూడా తమ ప్రతాపాన్ని చూపించాడు. ముస్లిం మతస్తుడవు కాబట్టే కావాలనే టీమిండియాని ఓడించావని, వెంటనే మీ పాకిస్తాన్‌కి వెళ్లిపోవాలంటూ పిచ్చి కూతలు కూశారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మహ్మద్ షమీపై అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్న నెటిజన్లను అదుపు చేసేందుకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్,, కొన్ని వేల పోస్టులను గుర్తించి, డిలీట్ చేయాల్సి వచ్చింది...

310

తాజాగా భారత సారథి విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ షమీపై ఆన్‌లైన్ అటాక్ చేసిన వారిపై ఫైర్ అయ్యాడు...

410

‘భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ టీమ్ గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. జాతీయ పతకాన్ని రెపరెపలాడించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో క్రికెట్ ఆడతాం. అంతేకానీ ఈ వెన్నెముక లేని వెధవలను ఎంటర్‌టైన్ చేయడానికి కాదు. 

510

మనిషికి ఎదురుపడి మాట్లాడే ధైర్యంలేని వాళ్లే, ఇలా సోషల్ మీడియాలో చెత్త వాగుడంతా పోస్టు చేస్తూ ఉంటారు. ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు, ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు...

610

సోషల్ మీడియా ఇలా ఎదుటివాళ్లని ఎగతాళి చేయడానికి, వారి ఎమోషన్స్‌తో ఆడుకోవడానికి వేదిక అవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఓ ప్లేయర్ మతాన్ని అడ్డుపెట్టుకుని, అతనిపై దాడి చేయడం ఎంతటి అమానవీయం...

710

మేం ఓ జట్టుగా, ప్రతీ ప్లేయర్‌ను అర్థం చేసుకుంటాం. మా క్యారెక్టరే మాకున్న బలం. మనంటూ ఓ క్యారెక్టర్ ఉండడం వల్లే మేమిప్పుడు ఇక్కడ ఉండగలిగాం. ఇలా ట్రోల్ చేసే వారికి దాని విలువ కూడా తెలీదు...

810

ఇలా వెన్నెముక లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతూ, చేతికి వచ్చినట్టు చెత్తను పోస్టు చేసేవారిని ఎంకరేజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయామనే బాధకంటే, వారి జీవితాల్లోనే ఫ్రస్టేషన్‌ని ఇలా చూపిస్తూ ఉంటారు...

910

ఇలా పోస్టులు చేసేవారికి వారిపై వారికి నమ్మకం ఉండదు. ఎదుటివాళ్లతో పోటీపడేందుకు సత్తా ఉండదు. అందుకే తమకంటే మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్లను తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు...

1010

జట్టులో ప్రతీ ఒక్కరూ మహ్మద్ షమీకి అండగా ఉన్నాం. అతను మ్యాచ్ విన్నర్. 200 శాతం అతను తర్వాతి మ్యాచ్‌లో ఆడతాడు. ఎవరి సత్తా ఏంటో బయటివాళ్లు చెబితే తెలుసుకునే పొజిషన్‌లో మేం లేము...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved