MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి

Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 5 మహిళా క్రికెటర్లలో ముగ్గురు టీమిండియా ప్లేయర్లే. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ లో మన హైదరబాదీ అమ్మాయే టాప్ లో ఉంది.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 02 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళా క్రికెటర్ల లిస్ట్ ఇదే..
Image Credit : Getty

ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళా క్రికెటర్ల లిస్ట్ ఇదే..

కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. దీంతో ఉమెన్ క్రికెటర్స్ సంపాదన కూడా ఎన్నో రెట్లు పెరిగింది… స్టార్ క్రికెటర్లు కొందరు కోట్లలో ఆదాయం పొందుతున్నారు. కేవలం మ్యాచ్‌లు ఆడటమే కాదు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, విదేశీ లీగ్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా మెన్ క్రికెటర్స్ స్థాయిలో ఉమెన్ క్రికెటర్లు సంపాదిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళా క్రికెటర్లు ఎవరు? ఇందులో ఇండియన్స్ ఎంతమంది? ఎవరి సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆస్ట్రేలియా క్రికెటర్లు బాాగా రిచ్..
Image Credit : Getty

ఆస్ట్రేలియా క్రికెటర్లు బాాగా రిచ్..

1. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – రూ.120 కోట్లు

ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ ఎల్లీస్ పెర్రీ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఉమెన్ క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ఈమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.120 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ తో పాటు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు పెర్రీ. ఇక అడిడాస్ (Adidas) వంటి పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలను కలిగివున్నారు... ఇలా ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా రెండుచేతులా సంపాదిస్తున్నారు... ఇవే ఈమె ప్రధాన ఆదాయ వనరు అని చెప్పవచ్చు.

2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – రూ.75 కోట్లు

ఆస్ట్రేలియాకే చెందిన మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ధనిక క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఈమె ఆదాయం మాత్రం తగ్గలేదు... ఆస్తి విలువ దాదాపు రూ.75 కోట్లు ఉంటుందని అంచనా. టీ20 లీగ్‌లు, కామెంటరీ ద్వారా ఇప్పటికీ లానింగ్ బాగానే సంపాదిస్తున్నారు.

34
ఇండియాలో ఈమే రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్
Image Credit : Getty

ఇండియాలో ఈమే రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్

3. మిథాలీ రాజ్ (ఇండియా) – రూ.43 కోట్లు

భారత మహిళల క్రికెట్‌లో 'లేడీ సూపర్‌స్టార్' గా గుర్తింపుపొందారు మిథాలీ రాజ్... ఇలా మంచి పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించారు. వరల్డ్ రిచ్చెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ల జాబితాలో మిథాలి మూడో స్థానంలో నిలిచారు.. ఇండియన్ క్రికెటర్స్ లో అయితే ఈమే టాప్. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ హైదరబాదీ క్రికెటర్ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు... క్రికెట్ వ్యాఖ్యాతగానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా బాగా సంపాదిస్తున్నారు. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు, మీడియా షోల ద్వారా కూడా ఆమెకు ఆదాయం వస్తోంది. సుమారు రూ.43 కోట్ల ఆస్తితో మిథాలీ రాజ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా క్రికెటర్‌గా కొనసాగుతోంది.

44
ఆటలోనే కాదు ఆదాయంలోనూ ఈ అమ్మాయిలు టాప్
Image Credit : x

ఆటలోనే కాదు ఆదాయంలోనూ ఈ అమ్మాయిలు టాప్

4. స్మృతి మంధాన (ఇండియా) – రూ.35 కోట్లు

ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సంపన్న మహిళా క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్రకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఆస్తి విలువ సుమారు రూ.35 కోట్లు. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు పొందుతున్నారు స్మృతి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో అత్యధిక జీతం అందుకుంటున్న ప్లేయర్ ఈమె... దీనిద్వారానే ఏటా కోట్లు సంపాదిస్తున్నారు.

ఇక ఎన్నో పెద్ద బ్రాండ్లకు మంధాన అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది… దీంతో డబ్బులే డబ్బులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది... ఇదికూడా ఆదాయ మార్గమే. ఇలా అన్ని రకాలుగా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఇండియన్ క్రికెటర్ స్మృతి మంధాన.

5. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా) – రూ.26 కోట్లు

ప్రస్తుత ఇండియన్ ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రిచ్చెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.26 కోట్లు. బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు, విదేశీ లీగ్‌లు, యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. ఈమె హయాంలోనే భారత మహిళల క్రికెట్ టీం ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఈ విజయం తర్వాత హర్మన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది... అమాంతం బ్రాండ్ వ్యాల్యూ పెరిగింది.

మొత్తం మీద ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళా క్రికెటర్ల జాబితాలో ముగ్గురు మనవాళ్లే ఉండటం గర్వించదగ్గ విషయం. ఇందులో తెలుగమ్మాయి టాప్ లో ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణం. మహిళల క్రికెట్‌లో ఎంత పెద్ద ఆర్థిక విప్లవం వచ్చిందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Indian Cricket: మ్యాచ్ లేకపోతే డ్యూటీకే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టాప్ టీమిండియా స్టార్స్ వీరే
Recommended image2
Cricket : ఐపీఎల్ సానబెట్టిన యంగ్ టాలెంట్స్.. టీమిండియా తలుపు తట్టే టాప్ 5 ప్లేయర్స్ వీళ్లేనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved