MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • UPI Offline Payment: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐతో మనీ ఎలా సెండ్ చేయాలో తెలుసా?

UPI Offline Payment: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐతో మనీ ఎలా సెండ్ చేయాలో తెలుసా?

UPI Offline Payment: ఇంటర్నెట్ లేదా నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీతో రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఎన్‌పీసీఐ ఆఫ్‌లైన్ టాప్ అండ్ పే సదుపాయం తీసుకొచ్చింది. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 22 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ సులభం
Image Credit : Gemini

ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ సులభం

దేశంలోని కోట్లాది మంది యూపీఐ యూజర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదా నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా సరే యూపీఐ ద్వారా చాలా ఈజీగా పేమెంట్స్ చేయవచ్చు. తాజా రిపోర్టుల ప్రకారం.. కస్టమర్ మొబైల్, వ్యాపారి వద్ద ఉండే పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ రెండూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినా సరే ట్రాన్సాక్షన్ పూర్తి చేసేలా కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

ఈ సిస్టమ్‌లో నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉన్న ఆఫ్‌లైన్ పోస్ టెర్మినల్‌పై టాప్ చేయడం ద్వారా కస్టమర్లు తమ బిల్లులను చెల్లించవచ్చు. ఈ కొత్త విధానంలో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.2,000 వరకు పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంటర్నెట్ లేకుండా ఇదెలా వర్క్ అవుతుంది?
Image Credit : PR

ఇంటర్నెట్ లేకుండా ఇదెలా వర్క్ అవుతుంది?

ఈ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి కస్టమర్ ముందే ఇంటర్నెట్ ఉన్న సమయంలో తన ఫోన్‌లోని యూపీఐ లైట్ వాలెట్‌లో డబ్బులు డిపాజిట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఉపయోగించి వ్యాపారి ఆఫ్‌లైన్ పోస్ టెర్మినల్‌ వద్ద నేరుగా పేమెంట్ చేయవచ్చు.

మరింత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రకమైన ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని రిపోర్టు పేర్కొంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న ఫోన్‌ను సంబంధిత పోస్ టెర్మినల్‌పై జస్ట్ టాప్ చేస్తే చాలు, పేమెంట్ ప్రాసెస్ తక్షణమే పూర్తవుతుంది.

Related Articles

Related image1
EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !
Related image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
35
విమానాలు, మెట్రో రైళ్లలో సూపర్ బెనిఫిట్
Image Credit : Getty

విమానాలు, మెట్రో రైళ్లలో సూపర్ బెనిఫిట్

తరచూ సిగ్నల్స్ కట్ అయ్యే ప్రాంతాల్లో లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ అసలు లేని చోట ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసే సమయంలో, భూగర్భ మెట్రో స్టేషన్లలో, సబ్‌వేలు లేదా రైల్వే నెట్‌వర్క్ సరిగా లేని సుదూర ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

రిపోర్టుల ప్రకారం, 2026 నాటికి ఎన్‌పీసీఐ ప్రముఖ పోస్ టెర్మినల్ తయారీ కంపెనీల డివైజ్‌లకు అవసరమైన సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. పోస్ టెర్మినల్స్ అనేది వ్యాపారులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ లేదా మొబైల్ వాలెట్ల ద్వారా డబ్బులు స్వీకరించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్ పరికరం. ఇకపై ఈ ఆఫ్‌లైన్ సిస్టమ్‌లో ఇంటర్నెట్ లేనప్పుడు పోస్ టెర్మినల్ పేమెంట్ అథరైజేషన్‌ను తాత్కాలికంగా సేవ్ చేసి ఉంచుకుంటుంది. మళ్లీ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ రాగానే ఆ వివరాలను వెరిఫికేషన్ కోసం మెయిన్ సర్వర్లకు పంపుతుంది. బ్యాంకులు, థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌లు కూడా ఈ సదుపాయాన్ని తమ యాప్‌లలో త్వరలోనే రోల్ అవుట్ చేయనున్నాయి.

45
యూపీఐ లైట్ ఎక్స్ కంటే ఇది ఎలా వేరు?
Image Credit : Asianet News

యూపీఐ లైట్ ఎక్స్ కంటే ఇది ఎలా వేరు?

ఎన్‌పీసీఐ సెప్టెంబర్ 2023లోనే యూపీఐ లైట్ ఎక్స్ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ లేనప్పుడు కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. జనవరి 2024లో ఎన్‌పీసీఐ విడుదల చేసిన యూపీఐ లైట్ ఎక్స్ గైడ్‌లైన్స్ ప్రకారం, ఎన్‌ఎఫ్‌సీ ఉన్న రెండు ఫోన్ల మధ్య ఆఫ్‌లైన్ పర్సన్-టు-పర్సన్ (P2P) పేమెంట్స్ చేసుకోవచ్చు.

అలాగే ఎన్‌ఎఫ్‌సీ ఉన్న క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్ లేదా స్టిక్కర్లపై టాప్ చేసి వ్యాపారులకు పేమెంట్స్ చేయవచ్చు. అయితే, ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త విధానంలో ముఖ్యమైన మార్పు 'హార్డ్‌వేర్'. వ్యాపారులు ఇప్పటికే వాడుతున్న సంప్రదాయ పోస్ టెర్మినళ్లపైనే ఎన్‌పీసీఐ సర్టిఫికేషన్‌తో ఇంటర్నెట్ లేకున్నా నేరుగా యూపీఐ పేమెంట్లను అంగీకరించవచ్చు.

55
ఆర్బీఐ నిబంధనలు అండ్ లిమిట్స్ ఏంటి?
Image Credit : Gemini

ఆర్బీఐ నిబంధనలు అండ్ లిమిట్స్ ఏంటి?

కొత్తగా ప్రతిపాదించిన ఈ ఆఫ్‌లైన్ యూపీఐ సదుపాయంలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.2,000 వరకు లిమిట్ ఉంటుంది. అయితే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్తమాన ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ నిబంధనల కంటే భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ ఉన్న ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ రూల్స్ ప్రకారం ఒక సాధారణ ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠ పరిమితి రూ.500 మాత్రమే. అదే సమయంలో ఒక పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌పై మొత్తం ఆఫ్‌లైన్ బ్యాలెన్స్ పరిమితి రూ.2,000గా ఉంది.

యూపీఐ లైట్ విషయానికి వస్తే ఒకసారి చేసే పేమెంట్‌కు రూ.1,000, వాలెట్‌లో గరిష్ఠంగా రూ.5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ కొత్తగా వచ్చే ఆఫ్‌లైన్ పోస్ సిస్టమ్‌కు సంబంధించి ఎన్‌పీసీఐ ఇంకా అధికారిక ఆపరేటింగ్ నిబంధనలను విడుదల చేయాల్సి ఉంది. కాబట్టి ఈ రూ.2,000 పరిమితి ఆర్బీఐ రూల్స్‌లో ఎలా అమలు అవుతుందనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

గమనించాల్సిన విషయమేమిటంటే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆఫ్‌లైన్ పేమెంట్ సదుపాయాన్ని ప్రారంభించడానికి కస్టమర్ ముందస్తు సమ్మతి తప్పనిసరి. ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక సంస్థలు యూజర్లకు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Recommended image2
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Recommended image3
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved