MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?

Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?

Agriculture: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వంటి దిగ్గజ టెక్ కుబేరులు లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను వరుసగా కొనుగోలు చేస్తున్నారు. ఈ టెక్ దిగ్గజాలు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 29 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వ్యవసాయ భూముల్లోకి బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్
Image Credit : chatgpt

వ్యవసాయ భూముల్లోకి బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్

అమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి వరకు కోడింగ్, యాప్‌లు, ఏఐ అంటూ నెట్ వరల్డ్‌ను ఏలిన టెక్ దిగ్గజాలు.. ఇప్పుడు సడన్‌గా వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల యజమానులు ఇప్పుడు వేల, లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. కొందరు కేవలం పెట్టుబడి కోసం భూములు కొంటుంటే, మరికొందరు స్వయంగా పశువుల పెంపకం, కూరగాయల సాగు చేపడుతున్నారు. అసలు ఈ టెక్ దిగ్గజాలు హఠాత్తుగా భూముల పై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోట్ల విలువైన ఫామ్‌లో జుకర్ బర్గ్ పశువుల పెంపకం
Image Credit : Asianet News

కోట్ల విలువైన ఫామ్‌లో జుకర్ బర్గ్ పశువుల పెంపకం

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆయన హవాయిలోని కౌవాయ్ ఐలాండ్‌లో ఉన్న ‘కౌలావు రాంచ్’లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 4,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రైవేట్ ఫామ్ విలువ సుమారు రూ. 2,871 కోట్లుగా ఉంది. జుకర్ బర్గ్ ఇక్కడ అత్యంత ఖరీదైన 'వాగ్యూ, ఆంగస్' జాతికి చెందిన పశువులను పెంచుతున్నారు. తన ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌తో పాటు పశువుల పెంపకం, వ్యవసాయ కార్యకలాపాల కోసం ఆయన ఈ భూమిని ఉపయోగిస్తున్నారు.

36
లక్షల ఎకరాల భూములకు అధిపతులుగా గేట్స్, బెజోస్
Image Credit : Getty

లక్షల ఎకరాల భూములకు అధిపతులుగా గేట్స్, బెజోస్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికాలోనే అతిపెద్ద వ్యవసాయ భూమి యజమానుల్లో ఒకరిగా నిలిచారు. రిపోర్టుల ప్రకారం, ఆయన దగ్గర ఏకంగా 2.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములను ఆయన లీజుకు ఇవ్వడంతో పాటు నేరుగా సాగు చేస్తున్నారు. మరోవైపు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వద్ద సుమారు 4.62 లక్షల ఎకరాల భూమి ఉంది. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన స్టెన్ క్రోన్కే వద్ద ఏకంగా 27 లక్షల ఎకరాల భూమి ఉంది. క్రోన్కే 2025లో న్యూమెక్సికోలో 9.38 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రాంచ్ విక్రయంగా నమోదైంది.

46
పంటలు, కూరగాయల సాగుతో క్రమమైన ఆదాయం
Image Credit : Getty

పంటలు, కూరగాయల సాగుతో క్రమమైన ఆదాయం

ఈ భారీ భూముల్లో కేవలం పశువుల పెంపకమే కాకుండా రకరకాల పంటలను కూడా పండిస్తున్నారు. అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఫామ్‌లలో బంగాళాదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలు, సోయాబీన్, మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. టెక్ బిలియనీర్లు ఈ భూముల్లో కొంత భాగాన్ని స్థానిక రైతులకు కౌలుకు కూడా ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు ఉపాధి దక్కడంతో పాటు భూ యజమానులకు క్రమం తప్పకుండా నెలకు మంచి ఆదాయం సమకూరుతోంది.

56
పెరుగుతున్న భూముల ధరలు
Image Credit : Getty

పెరుగుతున్న భూముల ధరలు

అమెరికాలో అగ్రికల్చర్ ల్యాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం, గత ఏడాది వ్యవసాయ భూముల ధరల్లో 4.3 శాతం పెరుగుదల నమోదైంది. భూమి పరిమితంగా ఉండటం, డిమాండ్ రోజురోజుకీ పెరగడంతో ఈ రంగాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బిలియనీర్లు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, రాబోయే రోజుల్లో వీటి విలువ మరింత పెరుగుతుందని భావించి పెద్ద ఎత్తున నిధులను వీటిలోకి మళ్లిస్తున్నారు.

66
ఏఐ డేటా సెంటర్లు, మారుతున్న లైఫ్‌స్టైల్
Image Credit : ChatGPT

ఏఐ డేటా సెంటర్లు, మారుతున్న లైఫ్‌స్టైల్

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు టెక్ కంపెనీలకు విపరీతమైన భూమి అవసరమవుతోంది. ఇది కూడా భూముల కొనుగోలుకు ఒక కారణం. మరోవైపు, కరోనా మహమ్మారి తర్వాత బిలియనీర్ల జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. పట్టణాలకు దూరంగా ప్రైవేట్ ఫామ్‌లలో నివసించడం, వేటాడటం, చేపలు పట్టడం, తమకు కావాల్సిన ఆర్గానిక్ ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ట్రెండ్‌గా మారింది. అయితే, బిలియనీర్లు ఇలా ఎగబడి భూములు కొంటుండటంతో ల్యాండ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చిన్న తరహా, యువ రైతులకు భూమి కొనడం పెద్ద సవాలుగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
వ్యవసాయం (Vyavasayam)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
స్థిరాస్తి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Recommended image2
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image3
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Related Stories
Recommended image1
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Recommended image2
USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved