MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్

Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్

Telangana New Airport Update: తెలంగాణలో కొత్తగా మరో 2 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. దీనిలో భాగంగా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఏఏఐ రూ.496.86 కోట్లతో ఓకే చెప్పింది. కాకతీయ రాజుల డిజైన్‌తో రాబోతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో కొత్తగా 2 ఎయిర్‌పోర్టులు.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Image Credit : Gemini

తెలంగాణలో కొత్తగా 2 ఎయిర్‌పోర్టులు.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. చారిత్రక నగరం వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ అప్‌డేట్ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఈ ప్రాజెక్ట్‌కు సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేయడమే కాకుండా, పనులను వేగవంతం చేసేందుకు గ్రౌండ్‌వర్క్ కూడా స్టార్ట్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుబట్టి కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఇప్పుడు మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు లైన్ క్లియర్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.496.86 కోట్లతో మామునూరు రీఎంట్రీ
Image Credit : ai

రూ.496.86 కోట్లతో మామునూరు రీఎంట్రీ

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ యాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాతపూర్వక సమాధానమిచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం ఏఏఐ సుమారు రూ. 496.86 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 

ఇప్పటికే రన్‌వే, ఆప్రాన్, టాక్సీవే, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు సంబంధించి ప్రాథమిక టెండర్ ప్రక్రియను కూడా ఏఏఐ ప్రారంభించడం విశేషం. భూసేకరణ, మిగిలిన చట్టబద్ధ అనుమతులు వేగంగా పూర్తయితే శంకుస్థాపన చేసి పనులు పరుగులు తీయిస్తామని తెలిపారు.

35
కాకతీయుల కళా వైభవంతో టెర్మినల్ డిజైన్
Image Credit : Getty

కాకతీయుల కళా వైభవంతో టెర్మినల్ డిజైన్

వరంగల్ సంస్కృతికి అద్దం పట్టేలా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రాచీన కాకతీయుల శిల్పకళా రీతుల్లో డిజైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల పర్యాటకరంగానికి పెద్దపీట వేసినట్లవుతుంది.

ఆదిలాబాద్, పెద్దపల్లి ఎయిర్‌పోర్టుల అప్‌డేట్

కేవలం వరంగల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

• ఆదిలాబాద్: ఇక్కడ ఉన్న పాత ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించేందుకు ఏఏఐ రీసెర్చ్ పూర్తి చేసింది. దీనికి కావలసిన అదనపు భూమి వివరాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి పంపింది.

• పెద్దపల్లి: పెద్దపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ఏఏఐ ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసి రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

45
భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు నిరాశేనా?
Image Credit : Getty

భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు నిరాశేనా?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని ఆశపడ్డ స్థానికులకు కేంద్రం షాకిచ్చింది. రామవరం, చెంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన స్థలం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఏమాత్రం తగినది కాదని తేల్చిచెప్పేసింది. 

అక్కడి సాంకేతిక సర్వే ప్రకారం.. ప్రతిపాదిత స్థలానికి అత్యంత సమీపంలో కొండలు, రైల్వే లైన్లు ఉండటం వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు తీవ్ర ప్రమాదకరం అని స్పష్టం చేసింది.

55
ఉడాన్ స్కీమ్‌తో తెలంగాణలో 58 ఫ్లైట్ రూట్లు
Image Credit : Getty

ఉడాన్ స్కీమ్‌తో తెలంగాణలో 58 ఫ్లైట్ రూట్లు

ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ (UDAN) పథకం కింద తెలంగాణలో ఇప్పటివరకు 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే పారిశ్రామికంగా, ఆర్థికంగా తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ వేగంగా భూసేకరణ పనులు పూర్తి చేస్తే, అతిత్వరలోనే వరంగల్ నుంచి ఫ్లైట్స్ టేకాఫ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
Nagadurga Top 5 Folk Songs: నాగవ్వతో నాగదుర్గ రచ్చ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !
Recommended image2
Telangana Goa: హైదరాబాద్‌కు దగ్గర్లోనే తెలంగాణ గోవా.. ఈ సీక్రెట్ ఐలాండ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved