MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం

మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం

Reliance: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 01 2026, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.10 నుంచే బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్
Image Credit : Asianet News

రూ.10 నుంచే బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్

బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌ల ధరలను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కేవలం రూ.10గా నిర్ణ‌యించారు. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం నాణ్యతతో పాటు తక్కువ ధరలో ఉత్పత్తులను అందించాలనే రిలయన్స్ వ్యూహంలో భాగంగానే ఈ బ్రాండ్‌ను రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిజమైన డెయిరీ క్రీమ్‌తో తయారీ
Image Credit : twitter

నిజమైన డెయిరీ క్రీమ్‌తో తయారీ

బాంబే క్రీమరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిజమైన డెయిరీ క్రీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు RCPL తెలిపింది. ఐస్‌క్రీమ్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అసలైన పాల పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. RCPL డైరెక్టర్ టీ. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. డెయిరీ ఉత్పత్తుల్లో షార్ట్‌కట్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈ బ్రాండ్‌ను రూపొందించామని చెప్పారు. ప్రతి భారతీయ కుటుంబం కొనుగోలు చేయగల ధరలో అసలైన ఐస్‌క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Related Articles

Related image1
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Related image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
35
ముందుగా పశ్చిమ భారతదేశంలో.. తర్వాత దేశవ్యాప్తంగా
Image Credit : chatgpt

ముందుగా పశ్చిమ భారతదేశంలో.. తర్వాత దేశవ్యాప్తంగా

బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు సిద్ధం చేసింది. రిలయన్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, భారీ రిటైల్ వ్యవస్థ ఉంది. దీంతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను వేగంగా వినియోగదారులకు చేరవేయడం కంపెనీకి సులభం కానుంది.

45
FMCG రంగంలో రిలయన్స్ దూకుడు
Image Credit : stockPhoto

FMCG రంగంలో రిలయన్స్ దూకుడు

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే ఆహారం, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ వినియోగ ఉత్పత్తుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంపా ద్వారా డ్రింక్స్‌ మార్కెట్లో రిలయన్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా వంట నూనెలు, పిండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే పప్పులు, బియ్యం, నూడుల్స్, సాస్‌లు, బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ కేర్, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తులు వంటి అనేక విభాగాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా FMCG రంగంలో రిలయన్స్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది.

55
ఐస్‌క్రీమ్ మార్కెట్లో దీర్ఘకాలిక వ్యూహం
Image Credit : instagram

ఐస్‌క్రీమ్ మార్కెట్లో దీర్ఘకాలిక వ్యూహం

భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి రావడం తాత్కాలిక నిర్ణయం కాదని RCPL స్పష్టం చేసింది. ఈ విభాగంలో దీర్ఘకాలికంగా వ్యాపారాన్ని విస్తరించాలనే లక్ష్యంతోనే బాంబే క్రీమరీని ప్రారంభించినట్లు తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ తన భారీ రిటైల్ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులను చేరుకుంటోంది. అదే బలాన్ని ఉపయోగించి ఐస్‌క్రీమ్ రంగంలో కూడా ప్రధాన బ్రాండ్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన డెయిరీ పదార్థాలు, అందుబాటు ధరలు, విస్తృత పంపిణీ వ్యవస్థతో బాంబే క్రీమరీ భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image2
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Recommended image3
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Related Stories
Recommended image1
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved