MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా

Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా

Indian Railways: రైళ్లలో ప్రయాణించే  సీనియర్ సిటిజన్లకు మంచి శుభవార్త. ఇకపై వారు ప్రశాంతంగా రైలు ప్రయాణ సమయంలో నిద్రపోవచ్చు. వారి నిద్రకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది రైల్వేే శాఖ.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 01 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైలు ప్రయాణం ప్రశాంతంగా
Image Credit : gemini and social media

రైలు ప్రయాణం ప్రశాంతంగా

భారత రవాణా వ్యవస్థలో రైళ్లే అతి ప్రధానమైనవి. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. బస్సులో బెర్త్ బుక్ చేసుకున్నా కుదుపుల వల్ల సరిగా నిద్రపట్టదు. కానీ రైళ్లలో బెర్త్ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఎంతో మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ ఇలా ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. కానీ వారి నిద్రకు భంగం కలిగేలా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఇండియన్ రైల్వే శాఖ కొన్ని కఠిన రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. అవి పాటించకపోతే భారీ జరిమానాలను కూడ వేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాత్రి 10 దాటితే ఈ రూల్స్
Image Credit : Google

రాత్రి 10 దాటితే ఈ రూల్స్

రైళ్లలోని రిజర్వేషన్ బోగీలలో ప్రయాణికులు ఎలా ఉండాలో కొన్ని రూల్స్ పెట్టింది.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ రూల్స్ అమల్లోకి వస్తాయి.  ఫోన్‌లో గట్టిగా మాట్లాడకూడదు. సెల్‌ఫోన్‌లో సినిమాలు లేదా రీల్స్ చూసేటప్పుడు తప్పనిసరిగా హెడ్‌ఫోన్స్ వాడాలి. రాత్రి 10 గంటల తర్వాత లైట్లు ఆపేయాలి. ఇలా చాలా రూల్స్ ను పెట్టింది. ఈ మధ్య కొందరు యువకులు ఈ నియమాలను ఇంట్లో ఉన్నట్టుగా ఫోన్‌లో పెద్ద సౌండ్‌తో రీల్స్, సినిమాలు చూస్తూ ఇబ్బంది పెడుతున్నారు. దీని వల్ల సీనియర్ సిటిజెన్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారు కఠిన చర్యలు తీసుకుంటారు.

34
కఠినంగా వ్యవహరించాలి
Image Credit : Asianet News

కఠినంగా వ్యవహరించాలి

రాత్రి పది అవుతున్న నిద్రపోకుండా ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం, లైట్లు ఆపకపోవడం వంటి పనులతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు తీవ్రంగా ఇబ్బంది పడతారు. డబ్బులు పెట్టి బెర్త్ బుక్ చేసుకున్నా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని వారు బాధపడతారు. అందుకే రైల్వే శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి 10 తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే, గట్టిగా పాటలు విన్నా, రీల్స్ చూసినా భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. 

44
మిడిల్ బెర్తు రూల్స్
Image Credit : social media

మిడిల్ బెర్తు రూల్స్

మిడిల్ బెర్తుకు కూడా రూల్స్ పెట్టింది రైల్వే శాఖ. రిజర్వేషన్ బోగీలో రాత్రి 10 గంటల తర్వాత లైట్లు ఆపేయాలి. రాత్రి 10 గంటలకు మిడిల్ బెర్త్‌ను పైకి లేపుకోవాలి. ఉదయం 6 గంటలకు దాన్ని కిందకు దించాలి. ఈ రూల్స్ మీరితే జరిమానా తప్పదని రైల్వే హెచ్చరించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Recommended image2
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved