MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది

Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది

Love Marriage:  ప్రేమికులు పెద్దల అంగీకారంతో పెళ్లి కావాలని కోరుకుంటారు. అలా కాకపోతే ఇంట్లోంచి వెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంత కష్టం లేకుండా ఒక గుడికి వెళితే చాలు ప్రేమికులకు పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 27 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రేమికుల్లారా ఈ గుడికి వెళ్లిండి
Image Credit : Getty

ప్రేమికుల్లారా ఈ గుడికి వెళ్లిండి

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంత సులువు కాదువ. అందుకు పెద్దలను ఒప్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. కులాలు, డబ్బు అంతరాలు చూపిస్తూ పెళ్లికి అడ్డుపడతారు. కొందరైతే ప్రేమను గెలిపించుకోవడానికి జీవితాంతం కుటుంబంతో పోరాడాల్సి వస్తుంది. ప్రేమ పెళ్లికి  ఇంట్లోవాళ్లు ఒప్పుకోరేమోనని భయం ఉంటే వెంటనే మీరు ఓ ఆలయానికి వెళ్లాలి. అక్కడికి వెళితే కచ్చితంగా ప్రేమికులకు పెళ్లవుతుందట. 

పెద్దల అంగీకారంతో పెళ్లి కావాలని కోరుకుంటున్న ప్రేమికులు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. సాక్షాత్తూ శివుడు, పార్వతీ దేవి వివాహం ఇక్కడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎందుకు అంత ప్రత్యేకం?
Image Credit : Getty

ఎందుకు అంత ప్రత్యేకం?

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది త్రియుగినారాయణ్ ఆలయం. దీన్ని పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేశారు. అయితే ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగిన ప్రదేశంగా చెప్పుకుంటారు. ఈ పెళ్లికి విష్ణువు కూడా హాజరయ్యాడని అంటారు.  విష్ణువు సాక్షాత్తూ పార్వతీ దేవి సోదరుడిగా వ్యవహరించగా, బ్రహ్మదేవుడు పురోహితుడిగా శివ పార్వతుల వివాహం జరిపించారు.

35
మండుతూనే ఉన్న అగ్ని
Image Credit : Getty

మండుతూనే ఉన్న అగ్ని

హిమాలయాల్లో సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయంలో 'అఖండ ధుని' అనే పవిత్ర అగ్ని ఉంటుంది. ఇది అఖండంగా మండుతూనే ఉంటుంది. ఇది శివపార్వతుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిహోత్రమని అంటారు. అప్పటి నుంచి ఇది ఆరకుండా మండుతూనే ఉందని భక్తుల నమ్మకం. ఈ అగ్నిని దర్శించుకుంటే వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని అంటారు.

45
పవిత్ర వివాహ స్థలం
Image Credit : Socialmedia

పవిత్ర వివాహ స్థలం

ఈ ఆలయానికి దగ్గరే రుద్ర కుండ్, విష్ణు కుండ్, బ్రహ్మ కుండ్ అనే మూడు పవిత్ర సరస్సులు ఉన్నాయి. తమ పెళ్లికి ముందు శివపార్వతులు ఈ చెరువుల్లోనే స్నానం చేశారని అంంటారు. అందుకే ఇప్పటికీ  చాలా జంటలు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే బంధం శాశ్వతంగా నిలుస్తుందని నమ్ముతారు.

55
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?
Image Credit : AI Generated

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?

ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ గ్రామంలో ఉంది. సోన్‌ప్రయాగ్ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సోన్‌ప్రయాగ్ నుంచి దారి అడవుల మధ్య నుంచి ఉంటుంది. ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. కానీ ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య వాతావరణం చాలా బాగుంటుంది. గ్రామంలో ఉండటానికి హోంస్టేలు, లాడ్జీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image2
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved