- Home
- Business
- Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Gold Price Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఉన్న పసిడి రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్కెట్‌లో ధరల్లో మార్పు కనిపించింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది.

మార్కెట్లో దోబూచులాడుతున్న పసిడి
బంగారం ధరలు మార్కెట్లో దోబూచలాడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవాళ బంగారం ధరలు పతనమయ్యాయి. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఉన్న పసిడి రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వడ్డీ రేట్ల నిర్ణయాలు.. మరోవైపు డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వరుసగా పెరిగిన బంగారం ధరలకు ప్రస్తుతం కరెక్షన్ వచ్చింది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసింది. ఫెడరల్ ఫండ్స్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత ఇన్వెస్టర్ల దృష్టి డాలర్, బాండ్లు వంటి ఆస్తులవైపు మళ్లడంతో బంగారం మార్కెట్‌లో ఒత్తిడి కనిపించింది.
రూ.1,52,840కు చేరిన బంగారం
దేశీయ మార్కెట్‌లో తాజా ధరలను చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,840గా ఉంది. గురువారం ఒక్కరోజే రూ.600 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,100కు చేరింది. ఈ రేటు కూడా ఒక్కరోజులో రూ.550 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి తాజా తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.
ఇక వెండి విషయానికి వస్తే.. పసిడి రేట్లు తగ్గినా వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి రూ.2.45 లక్షలు, బెంగళూరులో రూ.2.45 లక్షలు, చెన్నైలో రూ.2.50 లక్షలుగా ఉంది.
ఈ తగ్గుదల కొనసాగుతుందా?
విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ దాదాపు ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ బేస్ రేటుకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర నగల తయారీ ఖర్చులు అదనంగా ఉంటాయి.
ఫెడ్ తాజా నిర్ణయంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రెండు రోజుల పెరుగుదల తర్వాత దేశీయ మార్కెట్‌లో పసిడి రేట్లు తగ్గాయి. మరి రానున్న రోజుల్లో ఈ తగ్గుదల కొనసాగుతుందా? లేక మళ్లీ బంగారం ధరలు పైకి కదులుతాయా అన్నది డాలర్ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

