MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?

Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?

Weekly Horoscope: ఈ వార ఫలాలు 30.8.2026 నుంచి 5.9.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Aug 30 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ వారం మేషరాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగించవచ్చు. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారులకు కొత్త పరిచయాలు లాభదాయకం. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధాల్లో ఓర్పు అవసరం. ఒత్తిడి, నిద్రలేమి విషయంలో జాగ్రత్త వహించాలి. ధ్యానం, శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభరాశి వారికి ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు పాత బకాయిలు అందే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో తొందరపాటు మంచిదికాదు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది, ప్రేమ, దాంపత్యంలో అనుబంధం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఈ వారం మిథునరాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు రావచ్చు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం ఉన్నా ఖర్చులు పెరగవచ్చు. కుటుంబం, ప్రేమ విషయాల్లో స్పష్టతతో వ్యవహరించాలి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిద్రపై శ్రద్ధ పెట్టాలి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఈ వారం కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం, కుటుంబ మద్ధతు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా ఖర్చులు పెరగవచ్చు. ప్రేమ, దాంపత్యంలో అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. గురువారం గురుదేవుని ప్రార్థించడం, పసుపు వస్తువులు దానం చేయడం శుభప్రదం.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఈ వారం సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. భాగస్వామ్య వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. కుటుంబంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రేమలో పాత సమస్యలు మళ్లీ చర్చకు రావచ్చు. విద్యార్థులు ఏకాగ్రత కోసం క్రమబద్ధమైన ప్రణాళికతో చదవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఈ వారం కన్యరాశి వారికి పనిభారం పెరిగినా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తి చేసి, పై అధికారుల ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారులు లెక్కలు, ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రిస్తే పొదుపు సాధ్యమవుతుంది. కుటుంబ, ప్రేమ వ్యవహారాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. బుధవారం గణపతిని లేదా విష్ణువును ప్రార్థించడం శుభప్రదం.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఈ వారం తులరాశి వారికి సంబంధాలు, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యక్తిత్వ ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారులకు కొత్త భాగస్వామ్య అవకాశాలు రావచ్చు, అయితే నిబంధనలు పరిశీలించాలి. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ప్రేమ, దాంపత్యంలో అనుబంధం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఈ వారం వృశ్చికరాశి వారు వృత్తి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ఆలస్యంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు దూరప్రాంతాలు, ఆన్‌లైన్‌ ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. పెట్టుబడుల్లో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో పెద్దల అవసరాలను పట్టించుకోవడం మంచిది. ప్రేమ, దాంపత్యంలో అనుమానాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఈ వారం ధనుస్సురాశి వారు క్రమశిక్షణతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, విదేశీ లేదా దూరప్రాంత అవకాశాలను అందిపుచ్చుకోవడం మంచిది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. కుటుంబంలో సహనం, ప్రేమలో నిజాయతీ అవసరం. విద్యార్థులకు గురువుల మార్గదర్శకత్వం ఉపయోగపడుతుంది. ప్రయాణాలు ఉత్సాహాన్నిస్తాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఈ వారం మకరరాశి వారికి బాధ్యతలు పెరిగినా ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పాత లావాదేవీలను పరిశీలించి, అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి. ప్రేమ, దాంపత్యంలో అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవాలి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ వారం నిదానంగా ఉండటం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఈ వారం కుంభరాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు టెక్నాలజీ, కొత్త మార్కెట్ల ద్వారా అవకాశాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబం, ప్రేమలో అనవసర అపార్థాలకు తావివ్వకూడదు. ధ్యానం, ప్రార్థన మానసిక ప్రశాంతతనిస్తాయి. నిద్ర, ఆహారంపై శ్రద్ధ అవసరం. ఈ వారం భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఈ వారం మీనరాశి వారికి బాధ్యతలు పెరిగినా నెమ్మదిగా స్థిరమైన పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తిచేయడానికి మంచి సమయం. వ్యాపారులు పాత కస్టమర్లతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబం, ప్రేమ, దాంపత్యంలో ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలపై శ్రద్ధ వహించాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
Recommended image2
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved