MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!

Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!

Visha Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో శని, చంద్రుల కలయిక జరగనుంది. దానివల్ల అత్యంత అశుభకరమైన 'విష యోగం' ఏర్పడనుంది. ఈ యోగం వల్ల 5 రాశులవారికి తీవ్ర సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ రాశులేవో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 19 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విషయోగం వల్ల సవాళ్లు ఎదుర్కొనే రాశులు
Image Credit : Getty

విషయోగం వల్ల సవాళ్లు ఎదుర్కొనే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, చంద్రులు ఒకే రాశిలో కలిస్తే దాన్ని 'విష యోగం' అంటారు. ఇది చాలా సవాళ్లను తెచ్చిపెడుతుంది. సెప్టెంబర్ 25న, శని సంచరిస్తున్న మీన రాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో ఈ విష యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 5 రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేవో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృశ్చిక రాశి
Image Credit : AI Image

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తే, వాటిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. పాత పెట్టుబడుల వల్ల వచ్చిన నష్టాలు మళ్లీ ఆర్థిక భారాన్ని పెంచవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పెద్ద పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు కూడా రావచ్చు.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 రకాల వ్యక్తులతో సీక్రెట్స్ అస్సలు చెప్పొద్దు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
36
మేష రాశి
Image Credit : AI Image

మేష రాశి

జ్యోతిష్యుల అంచనాల ప్రకారం, మేష రాశి వారి 12వ ఇంట్లో ఈ విష యోగం ఏర్పడుతుంది. దీనివల్ల అనుకోని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విలాస వస్తువుల కోసం, అనవసర విషయాల కోసం ఖర్చు చేయడం వల్ల మీ పొదుపు దెబ్బతింటుంది. వృత్తిపరంగా కూడా పోటీ పెరగవచ్చు. పెద్ద పెట్టుబడుల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో నిదానంగా ఉండాలి. ఎగుమతి, దిగుమతి, వ్యవసాయం, టెక్నాలజీ, టెక్స్‌టైల్ రంగాల్లో ఉన్నవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

46
మీన రాశి
Image Credit : AI Image

మీన రాశి

శని ఇప్పటికే మీన రాశిలో ఉండగా, చంద్రుడు కూడా అదే రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి మీన రాశి వారిపై ఈ కలయిక ప్రభావం నేరుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఊహించని ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులపై వెంటనే లాభాలు ఆశిస్తే నిరాశ తప్పదు. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. అప్పులు చేయడం లేదా ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరుగుతుంది. ఉద్యోగాలలో ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడకుండా తీసుకోవడం మంచిది.

56
సింహ రాశి
Image Credit : AI Image

సింహ రాశి

సింహ రాశి వారి 8వ ఇంట్లో ఈ విష యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఆకస్మిక మార్పులు, ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు చాలాసార్లు ఆలోచించడం మంచిది. ఈ సమయంలో తొందరపడి కొత్త వ్యాపారం మొదలుపెట్టడం, పెద్దగా పరిచయం లేని రంగంలో డబ్బు పెట్టడం మంచిదికాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అయితే, కుటుంబ జీవితంలో భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఇద్దరూ కలిసి కొన్ని సమస్యలను సులభంగా అధిగమిస్తారు.

66
మకర రాశి
Image Credit : AI Image

మకర రాశి

మకర రాశివారికి ఈ విష యోగం 3వ ఇంట్లో ప్రభావం చూపుతుంది. దీనివల్ల తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి, కుటుంబ ఆస్తుల విషయంలో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో కొన్న ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన చట్టపరమైన సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు. అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలోనూ పోటీ పెరుగుతుంది. పని లేదా వ్యాపారం కారణంగా అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొన్ని ప్లాన్స్ మీరు అనుకున్నంత వేగంగా విజయం సాధించకపోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 రకాల వ్యక్తులతో సీక్రెట్స్ అస్సలు చెప్పొద్దు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved