MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!

Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!

Venus Blessings: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, సౌకర్యాలకు కారకుడైనా శుక్రుడి అనుకూల ప్రభావంతో 5 రాశుల వారికి మేలు జరగనుంది. ధనలాభం, వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్లు, అధికారం, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. మరి ఆ రాశులేవో, అందులో మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 21 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శుక్రుడి దయతో 5 రాశులకు మేలు
Image Credit : Asianet News

శుక్రుడి దయతో 5 రాశులకు మేలు

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, విలాసం, సౌకర్యం, అందం, కళలు, ప్రేమ, వైవాహిక జీవితం, ఆస్తులు, ఆర్థిక పురోగతికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, ఊహించని విధంగా డబ్బు రావడమే కాకుండా, సమాజంలో గౌరవం, పలుకుబడి, అధికారం కూడా పెరుగుతాయని నమ్మకం. ఆగస్టు 25న శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల 5 రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేవో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి, ఈ రాశివారికి శుక్రుడి సంచారం ఎప్పుడూ ప్రత్యేకమే. ధనలాభ స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల డబ్బు రాక పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, ఒప్పందాలు, లాభదాయకమైన భాగస్వామ్యాలు కుదరవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి, ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు రావచ్చు. శుక్రుడి దయతో విలాసవంతమైన వస్తువులు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Related image2
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
36
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

మిథున రాశి వారికి శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల వృత్తి, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, మీడియా, కళలు, కమ్యూనికేషన్, బ్యూటీ, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాక్చాతుర్యం, తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే కొత్త పరిచయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్ధతు కూడా లభించవచ్చు.

46
సింహ రాశి
Image Credit : https://chatgpt.com/

సింహ రాశి

సింహ రాశి వారికి శుక్రుడి అనుకూల స్థితి వల్ల పదవి, కీర్తి, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న మార్పు అనుకూలంగా జరగవచ్చు. పై అధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు దక్కవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు పెట్టుబడులను విస్తరించే అవకాశాలు పొందుతారు. జాతకంలో శుక్ర-సూర్య సంబంధం, దశమ భావం బలంగా ఉంటే అధికారం, సామాజిక హోదా కూడా పెరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది.

56
తుల రాశి
Image Credit : https://chatgpt.com/

తుల రాశి

తుల రాశికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి, ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. డబ్బు రాక, సంబంధాలు, సామాజిక పలుకుబడిలో మంచి మార్పులు ఉంటాయి. కొత్త ఉద్యోగావకాశం, ప్రమోషన్, వ్యాపార విస్తరణ లేదా లాభదాయకమైన భాగస్వామ్య వ్యాపారం వంటివి కలిసి రావచ్చు. ఆర్థిక విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటే పొదుపు పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాహనం, ఇల్లు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేసే యోగం ఉంది.

66
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశివారికి శుక్రుడి దయతో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడిదారులు లేదా ముఖ్యమైన భాగస్వాములు చేరవచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలకు ఫలం దక్కి, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. శుక్రుడితో పాటు గురు లేదా బుధుడు వంటి శుభ గ్రహాల అనుకూలత లభిస్తే, ధన బలంతో పాటు అధికార బలం కూడా చేకూరుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image3
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Recommended image2
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved