MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • RTC: ఇక‌ బ‌స్టాండ్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. బుక్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే బ‌స్సు వ‌చ్చేస్తుంది

RTC: ఇక‌ బ‌స్టాండ్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. బుక్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే బ‌స్సు వ‌చ్చేస్తుంది

RTC: ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లకుండానే తమ ఇంటి వద్ద నుంచి బస్సు ఎక్కే అవకాశం కలగనుంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 30 2026, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10 మందికి పైగా ఉంటే ప్రత్యేక పికప్ సదుపాయం
Image Credit : Gemini AI, Abhi Bus

10 మందికి పైగా ఉంటే ప్రత్యేక పికప్ సదుపాయం

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు నిర్ణీత సమయానికి బస్టాండ్ లేదా సూచించిన బస్ పికప్ పాయింట్‌కు చేరుకోవాలి. ముఖ్యంగా ఒక కుటుంబం లేదా పెద్ద బృందం కలిసి దూరప్రాంత ప్రయాణం చేసే సమయంలో ఇది కొంత ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ఒకే బుకింగ్‌లో 10 మందికి పైగా ప్రయాణికులు టికెట్లు తీసుకుంటే, వారి కోసం ఇంటి వద్ద నుంచి పికప్ సౌకర్యం కల్పించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అంటే ప్రయాణికులు బస్టాండ్ వరకు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ముందుగా నిర్ణయించిన ప్రాంతం నుంచి నేరుగా బస్సులో ఎక్కే అవకాశం కల్పించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలుత విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్
Image Credit : APSRTC

తొలుత విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్

ఈ సదుపాయాన్ని వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా విజయవాడ నగర పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత ప్రయాణికుల స్పందన, నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, రూట్లకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర నగరాలు, రీజియన్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి స్థాయి అమలుపై ఇంకా అధికారికంగా తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

35
దూరప్రాంతాల బస్సులకే అవకాశం
Image Credit : APSRTC

దూరప్రాంతాల బస్సులకే అవకాశం

ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఇంటి వద్ద పికప్ సదుపాయం అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తించదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు నడిచే హైయ్యండ్ సర్వీసులకు ఈ సౌకర్యాన్ని పరిమితం చేయాలని అధికారులు భావిస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి అగ్రశ్రేణి బస్సుల్లో దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవను రూపొందిస్తున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన కొన్ని సర్వీసుల్లోనే దీనిని అమలు చేసే అవకాశం ఉంది. ప్రయాణికుల సంఖ్య, బస్సు రూట్, పికప్ ప్రాంతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సౌకర్యాన్ని అందించేలా ప్రణాళిక రూపొందించనున్నారు.

45
బల్క్ బుకింగ్ చేసినవారు ముందుగా సమాచారం ఇవ్వాలి
Image Credit : our own

బల్క్ బుకింగ్ చేసినవారు ముందుగా సమాచారం ఇవ్వాలి

ఈ సదుపాయం పొందాలనుకునే ప్రయాణికులు కేవలం టికెట్లు బుక్ చేసుకుంటే సరిపోదు. బల్క్ బుకింగ్ వివరాలను ముందుగానే ఆర్టీసీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య, ప్రయాణ తేదీ, బస్సు సర్వీస్, పికప్ ప్రాంతం వంటి వివరాలను అధికారులు సేకరించిన తర్వాత ఇంటి వద్ద పికప్ సాధ్యమవుతుందా లేదా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ మార్గంలో బల్క్ బుకింగ్ వివరాలు అందించాలి అనే అంశాలపై ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి పూర్తి మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ విధానానికి సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

55
లగేజీతో ప్రయాణించే వారికి మరింత ఉపయోగం
Image Credit : Getty

లగేజీతో ప్రయాణించే వారికి మరింత ఉపయోగం

పెద్ద కుటుంబాలు, స్నేహితుల బృందాలు కలిసి దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు సామాన్లను బస్టాండ్ వరకు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటి వద్దే పికప్ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే బస్టాండ్‌కు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆటో, క్యాబ్ లేదా ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రయాణికులకు సమయం, అదనపు రవాణా ఖర్చు ఆదా కావడంతో పాటు.. ఒకే బృందంగా ప్రయాణించే వారికి ప్రక్రియ సులభతరం కానుంది. ప్రస్తుతం ఈ విధానంపై విజయవాడ రీజియన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయోగాత్మక అమలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్తులో ఈ సదుపాయాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే అంశాన్ని పరిశీలించనున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
Recommended image2
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?
Recommended image3
Now Playing
దళపతి విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన విజయవాడ ఉత్సవ్ | CM Vijay Powerful Speech at Vijayawada Utsav 2.0
Related Stories
Recommended image1
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Recommended image2
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved