MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు

Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు

Amaravati Real Estate: ఆంధ్రప్రదేశ్ రాజధాని రియల్ ఎస్టేట్ లెక్కలు చూస్తే మీరు షాక్ అవుతారు. అమరావతిలో పదేళ్లలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2014లో రూ.16 లక్షల పెట్టుబడి ఇప్పుడు రూ.1 కోటికి చేరి 600 శాతం లాభాలను అందించింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమరావతిలో ఆకాశాన్ని తాకుతున్న భూమి రేట్లు.. ఇన్వెస్టర్లకు పండగే
Image Credit : Chatgpt

అమరావతిలో ఆకాశాన్ని తాకుతున్న భూమి రేట్లు.. ఇన్వెస్టర్లకు పండగే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్‌లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎకరాల లెక్క నుంచి గజాల రేట్ల వరకు పదేళ్ల ప్రయాణం
Image Credit : Gemini

ఎకరాల లెక్క నుంచి గజాల రేట్ల వరకు పదేళ్ల ప్రయాణం

2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది.

రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి.

36
2014లో రూ.16 లక్షలు పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.1 కోటి
Image Credit : Chatgpt

2014లో రూ.16 లక్షలు పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.1 కోటి

ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి ఇచ్చిన రిటర్న్స్ ఊహకందని రీతిలో ఉన్నాయి. మధ్యలో రాజకీయ అనిశ్చితి వచ్చి ధరలు పడిపోయినా, ధైర్యంగా భూమిని హోల్డ్ చేసిన వారికి భారీ లాభాలు వచ్చాయి.

• 2014-15 పెట్టుబడి లెక్క: ఒక ఇన్వెస్టర్ 2014లో గజం రూ.8,000 చొప్పున 200 గజాల నివాస స్థలాన్ని కొన్నారనుకుందాం.

• మొత్తం పెట్టుబడి: 200 గజాలు × రూ.8,000 = రూ.16,00000 (రూ.16 లక్షలు)

• 2026 ప్రస్తుత మార్కెట్ విలువ: ప్రస్తుతం అమరావతిలో మౌలిక వసతుల పనులు వేగవంతం కావడంతో గజం ధర సగటున రూ.50,000 కి చేరింది.

• ప్రస్తుత విలువ: 200 గజాలు × రూ.50,000 = రూ.1 కోటి

అంటే 2014లో పెట్టిన రూ.16 లక్షల పెట్టుబడి పదేళ్ల కాలంలో ఏకంగా రూ.1 కోటిగా మారింది. ఇది దాదాపు 600 శాతం (6 రెట్లు) లాభం. మధ్యలో రేట్లు పడిపోయినప్పుడు భయపడి భూములు అమ్మేసిన వారు నష్టపోగా, ఓర్పుతో వేచి చూసిన వారికి ఇది నిజంగా జాక్‌పాట్‌గా మారింది.

46
స్మార్ట్ సిటీగా రూపాంతరం.. రియల్ ఎస్టేట్ పాఠం
Image Credit : Gemini AI

స్మార్ట్ సిటీగా రూపాంతరం.. రియల్ ఎస్టేట్ పాఠం

అమరావతి రియల్ ఎస్టేట్ ప్రయాణం ఇన్వెస్టర్లకు ఒక గొప్ప పాఠం నేర్పింది. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కేవలం డిమాండ్, సప్లై మీద నడుస్తుంది. కానీ అమరావతి విషయంలో అది ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, అంతర్జాతీయ నిధులపై ఆధారపడి నడిచింది.

ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధాన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఐటీ పార్కులు, ప్రముఖ విద్యా సంస్థల నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీంతో అమరావతి కేవలం ప్లాట్ల వ్యాపారంగా కాకుండా నివాస యోగ్యమైన "స్మార్ట్ సిటీ"గా మారుతోంది.

56
ఎకరం ధర రూ.10.25 కోట్లు ఖరారు చేసిన సీఆర్‌డీఏ
Image Credit : Twitter

ఎకరం ధర రూ.10.25 కోట్లు ఖరారు చేసిన సీఆర్‌డీఏ

అమరావతిలో భూముల విలువ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మరో తాజా ఉదాహరణ కూడా ఉంది. అదనపు భూమి సేకరణ కోసం సీఆర్‌డీఏ (APCRDA) ఎకరానికి రూ.10.25 కోట్ల రేటును ఖరారు చేసింది. అయితే ఇది ప్రభుత్వం అదనపు భూమి సేకరణ కోసం నిర్ణయించిన రేటు మాత్రమే. ఓపెన్ మార్కెట్‌లో ప్లాట్లు, కమర్షియల్ స్థలాల ధరలు అక్కడి సౌకర్యాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సీఆర్‌డీఏ రికార్డుల ప్రకారం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా మొత్తం 34,568.8 ఎకరాలను సమీకరించగా, భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లతో పాటు వార్షిక కౌలు కూడా అందిస్తున్నారు.

66
రాబోయే ఐదేళ్లలో అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది?
Image Credit : AI IMAGE GENERATED WITH GEMINI

రాబోయే ఐదేళ్లలో అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది?

అమరావతి కథను ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పన ఒక ప్రాంత రియల్ ఎస్టేట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూపించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 2015 నుంచి 2019 వరకు భారీ బూమ్, 2019 తర్వాత పతనం, 2024 నుంచి మళ్లీ ఊహించని రికవరీ.. ఇలా మూడు దశలను అమరావతి చూసింది.

ప్రస్తుతం రాయపూడి, వెలగపూడి వంటి కీలక ప్రాంతాల్లో గజం ధరలు రూ.45,000 నుంచి రూ.60,000 ప్లస్ పలుకుతున్నాయి. రాజధాని నిర్మాణం పూర్తిస్థాయికి చేరే కొద్దీ రాబోయే ఐదేళ్లలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
స్థిరాస్తి
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
Recommended image2
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?
Recommended image3
Now Playing
దళపతి విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన విజయవాడ ఉత్సవ్ | CM Vijay Powerful Speech at Vijayawada Utsav 2.0
Related Stories
Recommended image1
Dangerous Island: ఇక్కడికి వెళ్తే శవం కూడా దొరకదు! భారత్‌లోని అత్యంత భయంకరమైన ఐలాండ్ రహస్యాలివే !
Recommended image2
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved