Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ చెల్లెలుగా యంగ్ హీరోయిన్!

పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెల్లి పాత్రను యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ చేశారట. మూవీలో హీరో చెల్లి పాత్రకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వర్షను ఎంపిక చేశారట.

young heroin varsha bollamma as sister for allu arjun in pushpa
Author
Hyderabad, First Published Sep 14, 2021, 8:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పుష్ప మొదటి భాగం  షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. సెప్టెంబర్ చివరి వరకు జరగనున్న ఈ షెడ్యూల్ నందు, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం బన్నీ కాకినాడ లో ఉన్నాడు. అందుకే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ని చూడడానికి రాలేదు. 


ఇక పుష్ప అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కాగా, దర్శకుడు సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పుష్ప మూవీలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ గా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. క్రిస్మస్ కానుకగా, పుష్ప ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. 


కాగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెల్లి పాత్రను యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ చేశారట. మూవీలో హీరో చెల్లి పాత్రకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వర్షను ఎంపిక చేశారట. తమిళ్ లో సంచలన విజయం సాధించిన 96 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వర్ష, విజయ్ బిగిల్ మూవీలో కూడా నటించారు. తెలుగులో ఆమె వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో వర్ష హీరోయిన్ గా నటించారు. 


ఇక పుష్ప మూవీలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ పుష్ప మూవీలో ఓ కీలక రోల్ దక్కించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios