Asianet News TeluguAsianet News Telugu

CSI : యంగ్ హీరో ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ గ్లింప్స్ విడుదల.. ఆద్యంతం ఆసక్తికరం.!

యంగ్ హీరో ఆది సాయికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’ (CSI Sanatan). విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 
 

Young hero Aadi Saikumars CSI Sanatan Movie glimpses released, Interesting throughout!
Author
First Published Sep 27, 2022, 11:37 PM IST

ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస చిత్రాల్లో  నటిస్తున్నారు. చివరిగా ‘తీస్ మార్ ఖాన్’ చిత్రంతో అలరించారు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు ఆదికి కొన్నేండ్లుగా ఇండస్ట్రీలో ఎలాంటి హిట్ లేకున్నా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఆది సాయికుమార్ నటిస్తున్న చిత్రం ‘సీఎస్ఐ సననాతన్’ (CSI Sanatan). శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది హీరోగా నటిస్తున్న కొత్త ఇది. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో  గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా గ్లింప్స్ ను తాజాగా మేకర్స్  విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ (Aadi Saikumar) ఇంటెన్స్ మూడ్ లో కనిపించారు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ  నివేదిక తయారు చేస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్తులను  హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ సాగే క్రమం అంతా ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఆదిసాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా మిషా నారంగ్ నటిస్తోంది. అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్,  వసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీగా జిశేఖ‌ర్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనీష్ సోలోమాన్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.  నిర్మాత  అజ‌య్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్, గ్లింప్స్ చాలా డిఫరెంట్ ఉండటంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంతోనైనా ఆది సాయికుమార్ మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios