MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్

Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ధనుష్ X (ట్విట్టర్)లో చేసిన పోస్ట్ నెట్టింట పెద్ద చర్చే రేపుతోంది. విజయ్ బర్త్‌డేకి విష్ చేయని ధనుష్, ఇప్పుడు మోదీకి శుభాకాంక్షలు చెప్పడం వెనుక బీజేపీతో పొత్తు సంకేతాలు ఉన్నాయా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 17 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కమల్, విజయ్ దారిలో ధనుష్...
Image Credit : X

కమల్, విజయ్ దారిలో ధనుష్...

తమిళనాడు రాజకీయ చరిత్రలో 'నటులు రాష్ట్రాన్ని ఏలగలరా?' అనే ప్రశ్న ఎప్పుడూ వినిపించేదే. ఈ ప్రశ్నకు ఎంజీఆర్, జయలలిత, విజయ్ ఎన్నికల బరిలో నిలిచి గెలిచి సమాధానం చెప్పారు. దివంగత డీఎండీకే నేత విజయకాంత్ ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగారు. అదే సమయంలో శివాజీ గణేశన్, శరత్‌కుమార్, కె.భాగ్యరాజ్, టి.రాజేందర్ లాంటి వాళ్లు పార్టీలు పెట్టి మధ్యలోనే వదిలేసి రాజకీయాలకు దూరమయ్యారు. తమిళనాట గొప్ప నాయకుడిగా పేరున్న కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేక ఎదురుదెబ్బలు తిన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇది కేవలం శుభాకాంక్షలా? లేక పొలిటికల్ ఎంట్రీకి సిగ్నలా?
Image Credit : Asianet News

ఇది కేవలం శుభాకాంక్షలా? లేక పొలిటికల్ ఎంట్రీకి సిగ్నలా?

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, నటుడు ధనుష్ కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో 'సీఎం విజయ్‌కి పోటీగా మరో నటుడా?', 'ధనుష్ ముఖ్యమంత్రి కాగలరా?' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల చర్చలు మొదలుపెట్టారు.

33
ప్రధాని మోదీకి ధనుష్ ట్వీట్... భగ్గుమంటున్న నెటిజన్లు!
Image Credit : x

ప్రధాని మోదీకి ధనుష్ ట్వీట్... భగ్గుమంటున్న నెటిజన్లు!

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్న వేళ, నటుడు ధనుష్ కూడా తన X ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.

'సీఎం విజయ్ పుట్టినరోజుకు విష్ చేశారా?', 'బీజేపీ కూటమిలో చేరబోతున్నానని పరోక్షంగా చెబుతున్నారా?', 'తొలిసారి మోదీకి విష్ చేస్తున్నారు, ఇదెక్కడి కొత్త అలవాటు?' అని నిలదీస్తున్నారు. ధనుష్ ఫేమస్ డైలాగ్‌ను వాడి 'ఏం మేం బర్త్‌డే విష్ చేయకూడదా?' అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

అయితే, '2020లో కూడా ధనుష్ ప్రధాని మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు' అని ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క ట్వీట్‌తో ధనుష్ పెద్ద చర్చే లేవనెత్తారు. ఇది ఆయన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగా లేక మామూలు శుభాకాంక్షలా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image3
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Related Stories
Recommended image1
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved