యష్ భార్య రాధిక పండిట్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని పంచుకోగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇందులో మార్నింగ్ టైమ్‌లో తనయుడు యథర్వ్ కి, యష్‌కి మధ్య సరదాగా డిస్కషన్ జరిగింది.
రాకింగ్ స్టార్ యష్ `కేజీఎఫ్` సిరీస్‌లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సుమారు 12వందల కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనాలకు తెరలేపింది. `కేజీఎఫ్2` లో ఐ యామ్ ఏ బ్యాడ్ బాయ్ అని అంటుంటాడు హీరో యాష్. అది థియేటర్‌లో ఆడియెన్స్ కి బాగా నచ్చింది. ఆయన యాటిట్యూడ్, స్టయిలీష్ యాక్షన్‌కి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే రియల్ లైఫ్‌లోనూ యష్ బ్యాడ్ బాయ్ అట. ఎవరో కాదు, ఆయన ముద్దుల తనయుడే స్వయంగా చెప్పడం విశేషం.
తాజాగా యష్ భార్య రాధిక పండిట్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని పంచుకోగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇందులో మార్నింగ్ టైమ్‌లో తనయుడు యథర్వ్ కి, యష్‌కి మధ్య సరదాగా డిస్కషన్ జరిగింది. ఇందులో తనయుడిని యష్ ఆటపట్టించడం విశేషం. యష్ వైఫ్ మార్నింగ్ బ్రెస్ వేస్తుంది. వాషింగ్ బేసిన్ తల్లిపై కూర్చొని మారాం చేస్తున్నాడు అథర్వ్. ఈ టైమ్‌లో యష్.. `డాడి గుడ్ బాయ్` అని అనగా, దీనికి స్పందించిన అథర్వ్ `నో` అనడం విశేషం. అంతేకాదు `మమ్మి గుడ్ గర్ల్` అని, `డాడీ బ్యాడ్ బాయ్` అని చెప్పడం విశేషం.
యష్ ఎంత చెప్పినా `డాడీ గుడ్ బాయ్` అని కన్విన్స్ చేసి, బెదిరించి చెప్పుకున్నా, తనయుడు మాత్రం డాడీ బ్యాడ్ బాయ్ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యష్ తనయుడు చెప్పే మాటలు ఎంతో ముద్దొస్తుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. `యష్ తనయుడు సో క్యూట్` అంటున్నారు. అథర్వ్ అమ్మ కొడుకు అని, గారాబం చేస్తూ ఎంతో క్యూట్‌గా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. యష్-రాధికా జంటకి కూతురు ఐరా, కుమారుడు యథర్వ్ సంతానం.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన `కేజీఎఫ్ 2` సినిమా ఏప్రిల్ 14న విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. యష్ నటన, యాక్షన్, స్టయిల్, యాటిట్యూడ్‌తో కూడిన యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, బీజీఎం, బలమైన కంటెంట్ సినిమాని విజయపథాన నడిపించాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి, ఇండియన్ హైయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.
`కేజీఎఫ్` తర్వాత యష్ ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు. ఆ తర్వాత వచ్చే ఆయన సినిమాపై భారీ అంచనాలుంటాయి. ఈ నేపథ్యంలో కథ పరంగా ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారట. మళ్లీ ఓ భారీసినిమాకే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు నార్తన్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని, ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్టు టాక్.
