విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత 'గీత గోవిందం'తో మరో మెట్టు ఎదిగాడు. ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అట్టర్ ఫ్లాప్ అయిన 'నోటా' సినిమాకి కూడా విజయ్ కి ఉన్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి యూత్ లో అతడి 
క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అతడు నటించిన 'టాక్సీవాలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పైరసీకి గురైంది. ఎడిట్ చేయని మూడు గంటల సినిమాను ఆన్ లైన్ లో పెట్టేశారు. దీంతో చాలా మంది సినిమాను చూసేసి రివ్యూలు కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. పైరసీ విషయంలో చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా సినిమా హెచ్ డీ ప్రింట్ ని ఓ వెబ్ సైట్ విడుదల చేసింది. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో హై క్లారిటీ సినిమాని అప్ లోడ్ చేయడంతో సినిమా రూపకర్తలు ఈ విషయంపై పోరాడుతూనే ఉన్నారు. గతంలో ఇలా లీకైన సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా కూడా రిలీజ్ కి ముందు కొన్ని సన్నివేశాలను పైరసీ చేశారు.

దాంతో సంబంధం లేకుండా సినిమా సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే మొత్తం లీక్ అయిపోయింది. అయినప్పటికీ విడుదలైన తరువాత ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి విజయ్ దేవరకొండ.. పవన్ కళ్యాణ్ మాదిరి మ్యాజిక్ చేయగలడో లేదో చూడాలి!   

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!