కొన్ని విషయాలు కాకతాళీయంగా జరిగినా కావాలని చేసినట్లు అనిపిస్తూంటాయి. అలాంటి వాటిల్లో సినిమావాళ్లు చెప్పుకోదగ్గ అంశం రిలీజ్ డేట్స్ క్లాష్. ఎందుకంటే కథ ఎంత ఫెరఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారో..రిలీజ్ డేట్ అంతకంటే ఓ స్టెప్ ఎక్కువే చూసుకుంటారు. ప్రక్కన రిలీజ్ అయ్యే సినిమా ఏంటి ... అది మన సినిమా కలెక్షన్స్, ఓపినింగ్స్ పై ప్రభావం చూపుతుందా అనేది మొదట ఆలోచించే విషయం. ఇది సినిమా వాళ్ళంతా వేసే లెక్కే. అయితే చాలా సార్లు ఎంత లెక్కలేసుకుదిగినా...అవి తప్పుతుంటాయి. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంధోని విషయం అదే .

తమ చిత్రం రిలీజ్ డేట్ ని పెద్ద సినిమాలు వేటితోనూ క్లాష్ కాకూడదని,సోలోగా వచ్చి హిట్ కొట్టాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతకు ముందు రిలీజ్ డేట్ అనుకున్నప్పుడు విజయ్ దేవరకొండ నోటా సినిమా...రిలీజ్ కు వచ్చింది.  ఫామ్ లో ఉన్న కుర్రాడితో మనకెందుకు అని ప్రక్కకు తప్పుకున్నారు. నోటా డిజాస్టర్ అయ్యింది. అయ్యో...మనం రిలీజ్ చేసినా బాగుండేదే అని నాలుకు కరుచుకున్నారు. ఈ సారి ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుని పబ్లిసిటీ మొదలెట్టారు. అందులో భాగంగా టీజర్ కూడా వదిలారు. 

నవంబర్ 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. అయితే అదే రోజున విజయదేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా రిలీజ్ ఉంది. టాక్సీవాలా చాలా కాలం నుంచి నలుగుతున్న సినిమా. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే బయిటకు వదిలిన పాటలకు సైతం మంచి బజ్ వచ్చింది. అయితేనేం అమర్ అక్బర్ ఆంధోని టీమ్ ఈ సారి వెనకడుగు వెయ్యిదలుచుకోలేదు. అదే రోజున 24 కిసెస్,బ్లఫ్ మాస్టర్ అనే సినిమాలు కూడా రిలీజ్ కు ఉన్నాయి.  

విజయ దేవరకొండ గత చిత్రం నోటా ప్లాఫ్ నుంచి బయిటపడాలని , టాక్సీవాలా పై కాన్సర్టేట్ చేస్తున్నారు. విభిన్నంగా పబ్లిసిటీ డిజైన్ చేస్తున్నారు. రవితేజ, శ్రీనువైట్ల కూడా ప్లాఫ్ లలో ఉండటంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలని వాళ్లు గురి చూసి కొడుతున్నారు. మరి ఎవరి కష్టం ఫలిస్తుందో లేక అందరూ ఒడ్డున పడతారో చూడాలి!