Asianet News TeluguAsianet News Telugu

బన్నీ, మహేష్ రికార్డ్ బీట్ చేస్తాడా?

వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురంలో బుల్లితెరపై  ప్రసారం కానుంది. రేపు ఆదివారం సాయంత్రం ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం బుల్లితెరపై అత్యధిక టిఆర్పి నమోదు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

will banny beat mahesh record
Author
Hyderabad, First Published Aug 15, 2020, 9:16 PM IST

ఈ ఏడాది సంక్రాంతి పోరు రసవత్తరంగా సాగింది. ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల చేయగా, బన్నీ అల వైకుంఠపురంలో మూవీతో రావడం జరిగింది. ఈ రెండు చిత్రాలు భారీ విజయాలు నమోదు చేయడం విశేషం. ఇద్దరు హీరోలు కెరీర్ బెస్ట్ వసూళ్లు నమోదు చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోల రికార్డుల పోటీలో  బన్నీదే పై చేయి కావడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసింది. 

కాగా ఈ మూవి మొదటిసారి జెమినీ టెలివిజన్ లో ప్రసారం కానుంది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమినీ టీవీ రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారం చేయనుంది. బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రం బుల్లి తెరపై ఎంత టీఆర్పీ దక్కించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ ఆల్ టైమ్ టాప్ టీఆర్పీ నమోదు చేసింది. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ ద్వారా మహేష్ ఏకంగా 23.4 టీఆర్పీ సాధించారు. ఇంత వరకు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు 22.7 టీఆర్పీని మహేష్ బీట్ చేయడం జరిగింది. 

ఈ నేపథ్యంలో వెండితెరపై మహేష్ పై పైచేయి సాధించిన బన్నీ బుల్లితెరపై కూడా కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ రికార్డు బన్నీ అల వైకుంఠపురంలో మూవీతో బీట్ చేయాలి అంటే 24 టీఆర్పీ రాబట్టాలి. ఐతే ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. మరి చూద్దాం బన్నీ తన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ తో బుల్లితెరపై భారీ రికార్డు కొడతారేమో. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే బన్నీ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios