MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్

Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్

సెప్టెంబర్ 4న విడుదల కానున్న మా రాముడు అందరివాడు చిత్రంపై ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు సుమన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ మూవీలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.

3 Min read
Author : Tirumala Dornala
Published : Sep 02 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suman
Image Credit : Asianet News

Suman

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సీఎం పాత్రలో హీరో సుమన్
Image Credit : Asianet News

సీఎం పాత్రలో హీరో సుమన్

ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు.

35
200పైగా థియేటర్స్‌లో రిలీజ్
Image Credit : Asianet News

200పైగా థియేటర్స్‌లో రిలీజ్

నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్‌ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్. సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డివోపీ వినోద్, కుమార్‌‌ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకు రాబోతున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.

45
పద్నాలుగు నెలలు జర్నీ
Image Credit : Asianet News

పద్నాలుగు నెలలు జర్నీ

దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు పద్నాలుగు నెలలు ఈ సినిమాతో జర్నీ చేశాం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అవన్నీ దాటుకుని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీరామ్ గారు నా స్నేహితుడు. ఆయన సపోర్ట్‌తోనే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. హీరోయిన్ స్వాతి కూడా చాలా బాగా సహకరించారు. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఆమె మాకు సహకరించారు. ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, మాటలు, పాటలు, రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించాను. కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం. కానీ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కష్టపడితే ప్రతి ఒక్కరికీ సక్సెస్ వస్తుందని నిరూపించాం. ఇది నాకు సక్సెస్‌మీట్‌లా ఫీలవుతున్నా. పాజిటివ్ వైబ్‌ ఉండే టైటిల్, పాజిటివ్ వైబ్ ఉన్న కథ ఇది. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందిస్తాం. సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా”అని చెప్పారు.

55
సుమన్ గారితో కలిసి నటించడం అదృష్టం
Image Credit : Asianet News

సుమన్ గారితో కలిసి నటించడం అదృష్టం

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘‘చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మనం ప్రూవ్ చేసుకుంటాం. ఈ సినిమాలో చాలా దమ్ము ఉంది. ఇప్పటికీ నేను పదమూడు సినిమాలు చేశా. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. సుమన్ గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వంద సినిమాలు చేయాలనేది నా టార్గెట్”అని అన్నారు.

హీరోయిన్ స్వాతి మందాడి మాట్లాడుతూ..‘‘సుమన్ గారి లాంటి సీనియర్ నటుడితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఈ చిత్రంలో నా పాత్ర అందరికీ నచ్చుతుంది”అని చెప్పారు.

నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ, జబర్దస్త్ ఆర్టిస్టులు అప్పారావు, వినోద్, సహా మూవీ టీమ్ అంతా పాల్గొని ఈ వేడుకలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Recommended image2
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే
Recommended image3
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Related Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved