Asianet News TeluguAsianet News Telugu

Balakrishana: బాలయ్య టాక్ షో కి చిరు వెళ్లకపోవడానికి అసలు కారణం ఇదా?

 

  ఈ కార్యక్రమానికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం కాలేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని షో కు కంటెంట్ సైడ్  పని చేస్తున్న బీవీఎస్ రవి  బయటపెట్టారు.

Why chiranjeevi not in Balakrishna programme?
Author
Hyderabad, First Published Jan 27, 2022, 1:30 PM IST

బాలయ్యతో టాక్ షో ఏంట్రా బాబూ అన్నవాళ్లే.. చేస్తే బాలయ్యే చేయాల్రా అనేంతగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 1’సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ షో ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయాన్ని అందుకుంది. ఈ ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి 4న ప్రసారం కాబోయే మహేష్ బాబు ఎపిసోడ్‌తో ముగియనుంది. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో 4.3 మిలియన్లను క్రాస్ చేసి ట్రెండింగ్ నెంబర్ 1గా నిలిచింది.

ఇక  ఈ కార్యక్రమానికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం కాలేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని షో కు కంటెంట్ సైడ్  పని చేస్తున్న బీవీఎస్ రవి  బయటపెట్టారు.

సాధారణంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ ఉండటం వల్ల వీరిద్దరికి పరస్పర మనస్పర్ధలు ఉండటం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చాలామంది భావించారు. నిజానికి చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని రవి వెల్లడించారు.
 
మొదటి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన లేకపోయినప్పటికీ రెండవ సీజన్ లో మాత్రం మెగాస్టార్ తప్పకుండా పాల్గొంటారని అందుకు సంబంధించిన వర్క్ కూడా జరిగిందని బీవీఎస్ రవి వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం నాగార్జునని అడగలేదని ఇక వెంకటేష్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని ఆయన తెలియజేశారు. ఇక సీజన్ 2 ఈ ఏడాది చివరిలో ప్రారంభం కావచ్చని రవి తెలిపారు.

 ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్‌కి మొదటి గెస్ట్‌గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (మంచు లక్ష్మి, విష్ణు) హాజరయ్యారు. ఆ తర్వాత నాని బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, సుకుమార్, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రవితేజ , గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబులు గెస్ట్‌లుగా వచ్చారు. రానాతో పాటు వెంకటేష్ రావాల్సింది కానీ.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల అది మిస్ అయ్యింది. రెండో సీజన్‌లో వెంకటేష్ గెస్ట్‌గా ఫిక్స్ అయ్యారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios