Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' కథ నాదేనంటూ ప్రూఫ్ లతో సహా సోషల్ పెట్టేశాడు వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి. మొండికత్తి పేరుతో తను రాసిన కథనాన్ని కూడా బయటపెట్టాడు. ''ఏప్రిల్ 15న త్రివిక్రమ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. 

vempalli gangadhar sensational comments on trivikram and aravinda sametha
Author
Hyderabad, First Published Oct 15, 2018, 10:10 AM IST

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' కథ నాదేనంటూ ప్రూఫ్ లతో సహా సోషల్ మీడియాలో పెట్టేశాడు వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి. మొండికత్తి పేరుతో తను రాసిన కథనాన్ని కూడా బయటపెట్టాడు. ''ఏప్రిల్ 15న త్రివిక్రమ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

వెంటనే హైదరాబాద్ కి రమ్మన్నారు. ఆ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలుపెడుతున్నారు. నేను అక్కడకి చేరుకున్న సమయంలో సినిమాలో మొదటి ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత నాతో పరిచయం చేసుకున్న త్రివిక్రమ్ నా పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి నేను రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకొని నన్ను అభినందించారు.

రీసెర్చ్ సమయంలో నేను పడిన కొన్ని ఇబ్బందులు,కొంత సమాచారం 'హిరణ్య రాజ్యం' అనే పుస్తక రూపంలో వచ్చిందని ఆయనకి చెప్పాను.. సినిమాలో హీరోయిన్ పాత్రకి దాన్ని వాడుకున్నారు. షూటింగ్ స్పాట్ నుండి హోటల్ కి చేరుకున్నాం. నాతో కూర్చొని ఫ్యాక్షన్ కథల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేను రాసిన కక్షల కథల గురించి,  వాటి మూలాల గురించి వారికి చెప్పాను.

మూడు రోజులు వాళ్లతోనే కలిసి ఉచితంగా పని చేశాను. కానీ తెరపై నాపేరు వేయలేదు. వేరే వాళ్ల కథలను వాడుకునే స్వభావం గల దర్శకుడి కారణంగా నేను మోసపోయాను. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడు.. మనం రాసిన అన్ని కథల నుండి ఒక్కో పాత్రను దొంగిలించి కొత్త రకం వంట వండగలడు. అలా వండితే వచ్చిందే 'అరవింద సమేత''' అంటూ గంగాధర్ తన పోస్ట్ లో వెల్లడించారు. ఈ పోస్ట్ తో తను రాసిన కథలను సైతం షేర్ చేశారు.  

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

Follow Us:
Download App:
  • android
  • ios