Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. రోజు సినిమాకు సంబందించిన వార్తల గురించి సోషల్ మీడియాలో జరిగిన సంభాషణలు అన్ని ఇన్ని కావు. అయితే మొత్తానికి నేటితో ఆ ఓపికకు తెరపడనుంది. 

aravinda sametha premier show talk review and rating
Author
Hyderabad, First Published Oct 11, 2018, 5:36 AM IST

 

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎలాంటి హంగామా మొదలైందో అందరికి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. రోజు సినిమాకు సంబందించిన వార్తల గురించి సోషల్ మీడియాలో జరిగిన సంభాషణలు అన్ని ఇన్ని కావు. అయితే మొత్తానికి నేటితో ఆ ఓపికకు తెరపడనుంది. 

నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. త్రివిక్రమ్ సినిమాలకు ప్రవాసులు ముందునుంచే ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు  ఆ రిజల్ట్ ఎలా ఉందొ చూద్దాం. సినిమా విషయానికి వస్తే అనుకున్నట్టుగానే ఈ కాంబినేషన్ సరికొత్త కిక్ ను ఇచ్చిందని చెప్పవచ్చు. 

త్రివిక్రమ్ ఎక్కువగా యాక్షన్ ఎమోషనల్ కి సంబందించిన వాటిపై దృష్టిపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో 20 నిమిషాల పాటు సినిమా సూపర్బ్ గా ఉంటుంది. ఇక మిగిలిన ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు యావరేజ్ గా అనిపిస్తాయి. ఎంచుకున్న కథ బావుందనిపిస్తుంది. ఎన్టీఆర్ పూర్తిగా సినిమాను తన నటనతో కంట్రోల్ లో ఉంచుకున్నాడు. త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టు డైలాగ్స్ ఉంటాయి. అయితే ఆయన నుంచి ఆశించినంత కామెడీ పంచ్ లు మాత్రం ఎక్కువగా ఉండవు. అదే విధంగా కొన్ని చోట్ల కథను లాగదీసినట్లుగా అనిపిస్తుంది. 

కేవలం యాక్షన్ ఎమోషనల్ పై ద్రుష్టి పెట్టారని చెప్పవచ్చు. రెండు వర్గాల మధ్య జరిగే పోరులో కథానాయకుడు వీర రాఘవ రెడ్డి వ్యవహరించిన తీరు సినిమాకు ప్రధానమైన బలం. అరవింద(పూజ హెగ్డే) కు రక్షణగా ఉంటూ వర్గాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవల గురించి ఆలోచించిన విధానం బావుంటుంది. రామ్ రుధిరం సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో పిలాసఫికల్ గా సందేశాన్ని చెప్పడం సినిమాలో మెయిన్ హైలెట్. 

ముందుగా చెప్ప్పినట్టుగా సునీల్ తో కథ సాగుతూ ఉంటుంది. బెస్ట్ క్యారెక్టర్ తో సునీల్ మరి రీ ఎంట్రీ ఇచ్చాడని చెప్పవచ్చు. బాజిరెడ్డి గా జగపతి బాబు కనిపించిన తీరు సినిమాలో మరో హైలెట్. దాదాపు ఆ పాత్ర అన్ని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసిందని చెప్పవచ్చు. జగ్గు బాయ్ కనబరిచిన హావభావాలు సరికొత్తగా అనిపిస్తాయి. రావు రమేష్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక సీనియర్ నటి సుప్రియ పథక్ ఎన్టీఆర్ గ్రాండ్ మథర్ గా ఎమోషన్ ని పండించిన తీరు త్రివిక్రమ్ శైలిని మరోసారి తెరపై చూపిస్తుంది. 

ఫస్ట్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో కొంచెం నెమ్మదిగా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ పాయింట్ అంచనాలు పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా త్రివిక్రమ్ ఎమోషన్ తో కథను నడిపిస్తాడు. మహిళలకు సంబందించిన సీన్స్ హార్ట్ కి టచ్ అవుతాయని చెప్పవచ్చు. త్రివిక్రమ్ డైలాగ్స్ క్లాప్స్ కొట్టనివ్వడం గ్యారెంటీ. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. లాస్ట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.  

మొత్తంగా అరవింద సమేత ఉహలకందని రేంజ్ లో అయితే ఏమి ఉండదు. కమర్షియల్ ఫార్మాట్ లోనే దర్శకుడు కథను నడిపిస్తాడు. కాకపోతే తారక్ కలయికతో  త్రివిక్రమ్ మ్యానియాను కరెక్ట్ గా చూపించాడని చెప్పవచ్చు. కథ కుడా తారక్ కు కరెక్ట్ గా సెట్టయ్యింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెమెరా పనితనం యాక్షన్ సన్నివేశాలు త్రివిక్రమ్ ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్.

అయితే ఆయన నుంచి ఆశించే కామెడీ ట్రాక్ సినిమాలో కనిపించదు. అలాంటి స్పెస్ కూడా కథలో లేదనిపిస్తుంది.ఫైనల్ గా అరవింద సమేత ఈ దసరా ఫెస్టివల్ లో ఒక మంచి యాక్షన్ ఎండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా ఫ్యాన్స్ కి సినిమా ఎక్కువగా నచ్చుతుంది. పెద్దగా అంచనాలు పెంచుకోకుండా సినిమాకు వెళితే ఈ సినిమా హిట్టు బొమ్మ!   

 

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత.. కోలీవుడ్ లో కూడా కోత మొదలవ్వనుందా?

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే..?

కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

Follow Us:
Download App:
  • android
  • ios