టాలీవుడ్ లో మరో సినిమా ఉహించని విధంగా కలెక్షన్స్ సాధించింది. బాహుబలి 2 తరువాత ఆ స్థాయి కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అరవింద సమేత నిలిచింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కావడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి అనంతరం అత్యధిక వసూళ్లు అందుకున్న హీరోగా తారక్ నిలిచాడు. 

కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ - నైజం లో కలిపి సినిమా రూ.26.64కోట్ల షేర్స్ ను వసూలు సాధించినట్లు తెలుస్తోంది. మొదటి రోజు అత్యధికంగా  నైజంలో రూ .5.73 కోట్లను అందుకోగా అతితక్కువగా  నెల్లూరు రూ 1.06 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక మిగతా ఏరియాల్లో..  సీడెడ్ రూ. 5.48 కోట్లు - నెల్లూరు రూ 1.06కోట్లు - గుంటూరు రూ .4.14 కోట్లు - కృష్ణ 1.97 కోట్లు - వెస్ట్ Rs 2.37కోట్లు - ఈస్ట్ రూ 2.77కోట్లు - ఉత్తరాంధ్ర రూ 3.12 కోట్లు వసూలయ్యాయి. 

మొత్తంగా మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అరవింద సమేత 25 కోట్ల షేర్స్ ను దాటిస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక కర్ణాటకలో రూ 5.26కోట్ల వరకు షేర్స్ వచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన చుస్తే అరవింద సమేత ఇప్పటికే 30కోట్ల వరకు షేర్స్ అందించిందని చెప్పవచ్చు. ఇంకా మిగతా నెంబర్స్ చాలావరకు రావాల్సి ఉంది. బాహుబలి 2 మొదటిరోజు 42.87కోట్ల షేర్స్ సాధించింది. 

 

సంబంధిత వార్తలు

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ