త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

ఎప్పుడైతే కథానాయకుడు దర్శకుడు ఒక పనిలో ఆత్మీయతతో దగ్గరవుతారో వారి బంధం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి కూడా అందరూ అదే స్థాయిలో చర్చించుకుంటున్నారు. అరవింద సమేత ఘన విజయాన్ని అందుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. 

ntr sweet comments on trivikram

దర్శకులకు హీరోలకు ఉండే రిలేషన్ ను చుస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎప్పుడైతే కథానాయకుడు దర్శకుడు ఒక పనిలో ఆత్మీయతతో దగ్గరవుతారో వారి బంధం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి కూడా అందరూ అదే స్థాయిలో చర్చించుకుంటున్నారు. అరవింద సమేత ఘన విజయాన్ని అందుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. 

అయితే ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులందరు వారి అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలు మరోసారి అందరిని ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన మొత్తం ప్రేమను అదే సమయంలో చూపించాడు. త్రివిక్రమ్ ను ఎంతగా అభిమానిస్తున్నాడో ఆయన మాటలు వింటే ఎవరికైనా అర్ధమవుతుంది. 

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'పన్నెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలని. ఆయన నా మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, అన్న, ఆత్మ బంధువు, మా అమ్మకు ఇంకో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న, నాకు బావ.. ఇలా ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనతో  ఒక చిత్రం చేయాలి... చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో ఆ చిత్రం చిరస్థాయిగా మిగిలిపోవాలి. 

రేపొద్దున గర్వంగా నా పిల్లలకి ఈ  చిత్రాన్ని చూపించుకోవాలి. సమాజానికి ఆ చిత్రాన్ని చూపించి.. నేను కూడా గర్వంగా నిలుచునే స్థాయిలో ఉండాలని కోరుకున్న ఆ తరుణం మూడు రోజుల క్రితం రానే వచ్చింది అదే అరవింద సమేత' అంటూ తారక్ మాట్లాడారు. అదే విధంగా చిత్ర విజయం త్రివిక్రమ్ తన ఖాతాలో వేస్తున్నాడని చెబుతూ.. అది తప్పు ఎందుకంటే త్రివిక్రమ్ ను నమ్మేలా చేసింది ఆయన కథే. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన విజయం అరవింద సమేత అని ఎన్టీఆర్ తెలియజేశారు. 

 

సంబంధిత వార్తలు

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios