Asianet News TeluguAsianet News Telugu

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

పండగ సీజన్ లో కొత్త సినిమా రిలీజవుతోంది అంటే చాలు అభిమానులకు ముందు రోజు రాత్రి నిద్ర ఉండదు. రెండు రోజుల ముందే సినిమా గురించి చర్చలు పెట్టేస్తారు. మనసంతా సినిమాపైనే ఉంటుంది. ఎలాగైనా చూడాలని అనుకుంటుంటారు.

special holiday for aravindha sametha
Author
Hyderabad, First Published Oct 11, 2018, 6:59 AM IST

పండగ సీజన్ లో కొత్త సినిమా రిలీజవుతోంది అంటే చాలు అభిమానులకు ముందు రోజు రాత్రి నిద్ర ఉండదు. రెండు రోజుల ముందే సినిమా గురించి చర్చలు పెట్టేస్తారు. మనసంతా సినిమాపైనే ఉంటుంది. ఎలాగైనా చూడాలని అనుకుంటుంటారు. పనులన్నీ వదిలేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు బాగా ఆలోచించినట్లు తెలుస్తోంది. 

మనసంతా ఒక చోట నిమగ్నమైనప్పుడు దాని ఆశను నెరవేర్చాలి అనే ఫార్ములా సాఫ్ట్ వేర్ యాజమాన్యాలకు బాగా తెలుసు. అయితే రీసెంట్ గా విమోస్ టెక్నో క్రాట్స్ అనే కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు 11వ తేదీ హాలిడే ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా అందరికి అరవింద సమేత టికెట్లు ఉచితంగా ఇవ్వడంతో అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

యూఎస్ ప్రీమియర్స్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి,. మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక రిజల్ట్ ని బట్టి అరవింద సమేత బాక్స్ ఆఫీస్ రికార్డులు ఆధారపడి ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios