యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'అరవింద సమేత'. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించాడు త్రివిక్రమ్. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు మొదటి రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.

మంగళవారం యూఏఈ సెన్సార్ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆయన అనంతరం రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ నటన ఈ సినిమాను నిలబెట్టిందని, ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతడు చెప్పే డైలాగులు బాగున్నాయని కొనియాడారు. ఈ సినిమాకు తన రేటింగ్ నాలుగు స్టార్లు అని ఇచ్చారు.

తెలుగు సినిమాలకు ఆయన నాలుగు స్టార్లు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో ఫ్లాప్ అయిన 'స్పైడర్','నా పేరు సూర్య'సినిమాలకు కూడా ఆయన నాలుగు రేటింగ్ ఇచ్చారు. అలానే కొన్ని సినిమాలకు ఆయన ఇచ్చిన రేటింగ్ కూడా నిజమైంది. మరి 'అరవింద సమేత' విషయంలో ఏమవుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే..?

కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?