సినీ నటుడు ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా టికెట్ల విషయంలో టీడీపీ నేతలు.. అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో సాయిమహల్‌ థియేటర్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించుతున్నారు. కాగా  పట్టణంలో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ సినిమాలు విడుదలైతే నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను హడావుడి చేస్తుంటారు.

వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. అయితే రాంబాబు కొద్దిరోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాధుల శ్రీను ఇటీవలే వైసీపీలో చేరారు. అయినా నందమూరి హీరోలపై అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘అరవింద సమేత’ మొదటి షో అభిమానులే చూడాలన్న ఆశతో రాంబాబు, శ్రీను అభిమానులను వెంటబెట్టుకుని టికెట్ల కోసం వెళ్లారు. అయితే థియేటర్‌ మేనేజర్‌.. మీరు వైసీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని కాబట్టి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ