Asianet News TeluguAsianet News Telugu

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు నుంచే రికార్డుల కోతను మొదలుపెట్టింది. ఇప్పటికే బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచిన ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో తారక్ కు మంచి మార్కెట్ ఉన్నట్లు రుజువుచేసింది. 

aravindha sametha satellie rights
Author
Hyderabad, First Published Oct 12, 2018, 3:20 PM IST

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు నుంచే రికార్డుల కోతను మొదలుపెట్టింది. ఇప్పటికే బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచిన ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో తారక్ కు మంచి మార్కెట్ ఉన్నట్లు రుజువుచేసింది. 

ఇక సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అభిమానులు కోరుకునే యాక్షన్ ఎమోషన్ మాటలు ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్న త్రివిక్రమ్ ఎట్టకేలకు కమర్షియల్ హిట్ కొట్టినట్లు క్లారిటీ వచ్చేసింది. మీడియా నుంచి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అసలు మ్యాటర్లోకి వస్తే.. అరవింద సమేత శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ తెలుగు చానెల్ 23.50కోట్లకు పోటీపడి కొనుగోలు చేసినట్లు సమాచారం. 

ఎన్టీఆర్ కెరీర్ లోనే శాటిలైట్స్ హక్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. యూఎస్ లో ఇప్పటికే సినిమా 1 మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేసింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం హాలిడేస్ ఉండడంతో సినిమాకు మరింత లాభం చేకూరే అవకాశం ఉంది. 

 

సంబంధిత వార్తలు

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

Follow Us:
Download App:
  • android
  • ios