సినీనటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 25 ఫోన్ కాల్స్ వచ్చాయి.

ఫోన్ చేసిన ఆగంతకులు యుగేంద్రతో పాటు కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. వీటి వెనుక బంజారాహిల్స్‌కు చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు యుగేంద్ర ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.