Asianet News TeluguAsianet News Telugu

ఆ కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ శోభ శెట్టి... అభిమానుల శుభాకాంక్షలు!

బిగ్ బాస్ ఫేమ్ శోభ శెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంది. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో అడుగుపెట్టింది. గృహప్రవేశం వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 

bjgg boss fame shobha shetty owns a house ksr
Author
First Published Apr 30, 2024, 5:05 PM IST

కార్తీక దీపం మోనితగా పాప్యులర్ అయ్యింది కన్నడ అమ్మాయి శోభ శెట్టి. కార్తీక దీపం సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శోభ శెట్టి తెలుగు ప్రేక్షకుల\కు దగ్గరయ్యారు. కార్తీక దీపం దీప, కార్తీక్, మోనిత పాత్రల చుట్టే తిరుగుతుంది. ఏళ్ల తరబడి తిరుగులేని సీరియల్ గా ఉన్న కార్తీక దీపం నేషనల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడం విశేషం. కార్తీక దీపం 2023 జనవరిలో ముగియగా శోభ శెట్టి బిగ్ బాస్ సీజన్ 7లో ప్రత్యక్షం అయ్యింది. 

హౌస్లో సైతం విలనిజం పండించింది శోభ శెట్టి. ఆమె యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, అగ్రెసివ్నెస్ జనాలకు నచ్చలేదు. శోభ శెట్టి ఎలిమినేట్ కావాలని చాలా మంది కోరుకున్నారు. అయితే స్టార్ మా ఆమెను కాపాడిందనే వాదనలు ఉన్నాయి. శోభ శెట్టి 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ తృటిలో కోల్పోయింది. బయట తనపై నెగిటివిటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకున్న శోభ శెట్టి క్షమాపణలు కోరింది. 

ప్రస్తుతం శోభ శెట్టి ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు. కాగా శోభ శెట్టి తన సొంతింటి కల నెరవేర్చుకుంది. నూతన గృహాన్ని నిర్మించుకుంది. తాజాగా గృహప్రవేశం చేసింది. ఈ వేడుకకు తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ పిలిచింది. టేస్టీ తేజ, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్ తో పాటు పలువురు హాజరయ్యారు. 

ప్రియుడు యశ్వంత్ రెడ్డితో పాటు శోభ శెట్టి గృహప్రవేశ వేడుక నిర్వహించింది. శోభ శెట్టి కొత్త ఇంట్లోకి వెళ్లారన్న సంగతి తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా శోభ శెట్టి బిగ్ బాస్ షో వేదికగా యశ్వంత్ రెడ్డి తన ప్రియుడని పరిచయం చేసింది. యశ్వంత్ రెడ్డి కూడా సీరియల్ నటుడు. వీరు త్వరలో వివాహం చేసుకోనున్నారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios