Asianet News TeluguAsianet News Telugu

'ఊ అంటావా మావ' సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన దేవిశ్రీ ప్రసాద్, రణ్వీర్ సింగ్ (వీడియో)

 'ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా' పాట సినిమా రిలీజై ఇంతకాలం అయినా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తెగ సందడి చేస్తోంది. 

Devi Sri Prasad   Ranveer Singh Dance For Oo Antava Song! jsp
Author
First Published Apr 30, 2024, 6:41 AM IST


ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన  పుష్ప సినిమాలో పాటలు (Pushpa)ఏ రేంజిలో  హిట్టయ్యాయో అందరి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్​, అల్లు అర్జున్​, సుకుమార్ కాంబినేషన్ వచ్చిందంటే.. కచ్చితంగా ఆ సినిమాలో ఐటం సాంగ్ ఉండి తీరాలి..అది పెద్ద హిట్ అవ్వాలి.  ఆర్య సినిమాతో స్టార్ అయిన ఈ ట్రెండ్​.. పుష్ప సినిమా వరకు కొనసాగింది. 

ఆర్య సినిమాలో 'ఆ అంటే అమలాపురం' సాంగ్​.. ఆర్య-2 సినిమాలో 'రింగ రింగ' సాంగ్ ఓ ఊపు (Ringa Ringa song) ఊపేశాయి. ఇక పుష్పలోనూ.. 'ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా' పాట సినిమా రిలీజై ఇంతకాలం అయినా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తెగ సందడి చేస్తోంది.  ఈ సాంగ్ స్పెషాలటి ఏమిటంటే.. సమంత తొలిసారి ఐటం (Samantha) సాంగ్​లో కనిపించడం.

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు అందులో సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అందులో సమంత తో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ అదరగొట్టిన ఊ అంటావా మావ సాంగ్ అయితే యూత్ లోకి తెగ వెళ్లిపోయింది. మాస్ ఆడియన్స్ ని ఎంతో అలరించింది.

ఇక తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రెసెప్షన్ కి విచ్చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరియు బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇద్దరూ కూడా ఊ అంటావా మావ సాంగ్ కి డ్యాన్స్  చేసి దుమ్ము రేపారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా దేవిశ్రీ ఆ వీడియోని షేర్ చేయగా  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

Follow Us:
Download App:
  • android
  • ios