Asianet News TeluguAsianet News Telugu

నేను బతికి ఉండగా ఆ పని చేయనివ్వను: ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం బీజేపీ అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది.  ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జ‌హీరాబాద్ లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులైన బీబీ పాటిల్(జహీరాబాద్), ర‌ఘునంద‌న్‌రావు(మెదక్) కు మ‌ద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

Prime Minister Narendra Modi attended and addressed a public meeting in Zaheerabad Telangana KRJ
Author
First Published Apr 30, 2024, 6:08 PM IST

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. పోలింగ్ తేదీకి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ త‌రుణంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), బీజేపీ నేతలు తెలంగాణపై ఫోకప్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా  తెలంగాణ ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. నేడు ప్రధాని మోడీ జ‌హీరాబాద్ లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులైన బీబీ పాటిల్(జహీరాబాద్), ర‌ఘునంద‌న్‌రావు(మెదక్) కు మ‌ద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ పై మోడీ కీలక విమర్శలు చేశారు.  రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంధమనీ, కానీ కాంగ్రెస్ కించపరుస్తుందని అన్నారు. రాజ్యాంగం పట్ల, పార్లమెంట్ పట్ల ఎంతో గౌరవం ఉందని అన్నారు. అలాగే.. నూతన నిర్మించిన పార్లమెంట్ లో రాజ్యాంగ ఉంచాననీ, ప్రవిత గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నానన్నారు. 

రాజ వంశీయులు రాజ్యాంగాన్ని నిర్వీహం చేస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తన సొంత రాజ్యాంగాన్ని కూడా విస్మరించిందనీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అన్నారు.  కాంగ్రెస్  పార్టీనే రాజ్యాంగంలో మొదట సవరణలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, నెహ్రు కుటుంబానికి దక్కుతుందని అన్నారు. రాజవంశీలు ఈ దేశాన్ని పరిపాలించడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారనీ, ప్రజాస్వామ్యం కించపరుస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుంటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందనీ, ఆ పార్టీ దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని చూస్తుందని ప్రధాని మోడీ విమర్శించారు. అలాగే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని, అలాగే.. బీఆర్ ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందనీ, ఇరు పార్టీలు పరస్పరం సహరించుకుంటున్నాయని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. 

మోడీ జీవించినంత కాలం రాజ్యాంగాన్ని కదిలిచే శక్తి ఎవరికి లేదనీ, తాను బతికి ఉన్న కాలం దళిత, ఆదివాసులు, బీసీల హక్కుల రక్షణ కోసం పాటు పడుతానని అన్నారు. తాను మూడో సారి ప్రధాని అయినా తరువాత.. ఘనంగా రాజ్యాంగ 75 వారికోత్సవం ఘనంగా నిర్వహిస్తాననీ, ఆ మహా వేడుకలో ప్రజల అందర్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు.  అలాగే.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఎలా తూటు పోడిచిందో బహిరంగపరుస్తామని అన్నారు. 

తెలంగాణ బీజేపీ 4 వందేమాతరం ఎక్స్ ప్రెస్ తో పాటు 40 రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు. పలు హైవేలను అభివ్రుద్ది పరుస్తున్నామని అన్నారు. తెలంగాణ అభివ్రుద్దికి బీజేపీ పెద్దపీట వేసిందనీ, సిద్దిపేట్ , సిరిసిల్లా, కొత్తపేట రైల్వే స్టేషన్ మంజూర్ చేస్తే.. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ అడ్డంగులు స్రుష్టిస్తుందని అన్నారు.

ఓట్ల కోసం విక్రుత చేష్టలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రగతి బాటలో నడిపించే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. ఈ సారి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదనీ, బీజేపీ అభ్యర్థులకు వేసే ఓటు డైరెక్ట్ గా తనకు వేసినట్టు అవుతుందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios