Asianet News TeluguAsianet News Telugu

ఈ 13 హారర్ సినిమాలు చూస్తే.. లక్ష గిప్ట్!

తాము చెప్పిన 13 సినిమాలను 9 రోజుల వ్యవధిలో చూస్తే 1300 డాలర్లు అంటే మన లెక్కల్లో సుమారు రూ.95,800 బహుమతి ఇస్తామని ప్రకటించింది.

 

This company will give you 1 lakh if you can watch these 13 horror movies
Author
Los Angeles, First Published Sep 15, 2021, 1:15 PM IST

మీరు హారర్ మూవీ లవర్సా? అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీకే.. అంటూ అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. తాము చెప్పిన 13 సినిమాలను 9 రోజుల వ్యవధిలో చూస్తే 1300 డాలర్లు అంటే మన లెక్కల్లో సుమారు రూ.95,800 బహుమతి ఇస్తామని ప్రకటించింది.

‘‘హారర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’’ అని ఈ ఉద్యోగానికి పేరు పెట్టింది ఫైనాన్స్‌బజ్ అనే అమెరికా సంస్థ. హారర్ చిత్రాల్లో నాణ్యతపై సినిమా బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని అంచనా వేయడానికే ఈ అధ్యయనం చేస్తున్నారట. ఈ మేరకు ఫైనాన్స్ బజ్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది.

‘‘వాంటెడ్: తక్కువ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే, భారీ బడ్జెట్ హారర్ సినిమాలు ఎక్కువ భయం పుట్టిస్తాయా? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం 13 హారర్ చిత్రాలు చూడాలి. దీనికోసం మంచి హారర్ మూవీ ప్రియులు కావాలి’’ అంటూ సదరు సంస్థ ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వాళ్లు 18 సంవత్సరాలు నిండిన అమెరికా పౌరులు అయ్యుండాలి.

అలాగే సినిమాలు చూసిన తర్వాత వాటి బడ్జెట్‌ను అంచనా వేసి ఈ సినిమాలకు ర్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీకి దరఖాస్తులు స్వీకరించే ఆఖరి తేదీ ఈ నెల 26. అక్టోబరు 1న ఎంపికైన విజేతలను ప్రకటిస్తారు. వీరు వచ్చే నెల 9 నుంచి 18 వరకూ కంపెనీ ఎంపిక చేసిన 13 చిత్రాలను చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాలు చూసే సమయంలో వీరు ఫిట్‌బిట్ వాచ్ ధరించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఎంపిక చేసిన చిత్రాలివే..

సా (SAW)
అమిటీవిల్లె హారర్
ఎ క్వయిట్ ప్లేస్
ఎ క్వయిట్ ప్లేస్ పార్ట్ 2
క్యాండీమ్యాన్
ఇన్‌సైడియస్
ది బ్లైర్ విచ్ ప్రాజెక్ట్
సినిస్టర్
గెట్ అవుట్
ది పర్జ్
హాలోవీన్ (2018)
పారానార్మల్ యాక్టివిటీ
అన్నబెల్లె 
 

Follow Us:
Download App:
  • android
  • ios